Begin typing your search above and press return to search.

నయనతార ఫ్యామిలీ ఫ్రేమ్.. స్టైలిష్ లుక్స్!

ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఒక వైపు సినిమా కెరీర్ ను మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను చాలా బాగా హ్యాండిల్ చేస్తోంది

By:  Tupaki Desk   |   18 Nov 2023 2:01 PM GMT
నయనతార ఫ్యామిలీ ఫ్రేమ్.. స్టైలిష్ లుక్స్!
X

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు వెళ్లిపోతున్నారు కానీ నయనతార మాత్రం గత 15 ఏళ్లకు పైగా సౌత్ ఇండస్ట్రీలో ఒకేతల రోజు స్టార్ ఇమేజ్ తో ముందుకు కొనసాగుతోంది.

ఈ మధ్య అత్యధిక ఎక్కువ కాలం స్టార్ హోదాను చూసిన అతి కొద్దిమంది నటీమణులలో నాయనతార టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ బ్యూటీ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా అదే తరహాలో తన స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఒక వైపు సినిమా కెరీర్ ను మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను చాలా బాగా హ్యాండిల్ చేస్తోంది

ఇక నేడు నయనతార పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇద్దరు కవల పిల్లలతో అలాగే భర్త విగ్నేష్ శివన్ తో హ్యాపీగా ఉన్న ఒక ఫొటో కూడా ఆకట్టుకుంటోంది. అందులో నాయన జీన్స్ లో చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చింది. ఇక ఇద్దరు కవలలను తండ్రి విగ్నేష్ శివన్ చెరో వైపు ఎత్తుకొని స్టిల్ ఇచ్చాడు.

ఎంతో చూడ ముచ్చటగా ఉన్న ఈ క్యూట్ ఫ్యామిలీని చూసి నెటిజన్లు పాజిటీవ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను గత ఏడాది జూన్ లో పెళ్లి చేసుకుంది. ఇక అదే ఏడాది సెప్టెంబర్ లో సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. మొదటి కుమారుడు పెరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ మరియు రెండవ కుమారుడు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్.

షూటింగ్ లకు ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా నయన్ విగ్నేష్ శివన్ ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా నయన్ జవాన్ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అనంతరం అమ్మడికి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి రెమ్యునరేషన్ 10 కోట్లు దాటినట్లు టాక్.