Begin typing your search above and press return to search.

నేను బికినీ ధరించడం అందరికీ సమస్యలా అనిపించింది: నయనతార

ఇందులో నయనతార 'గజినీ' సినిమాలో తాను ధరించిన దుస్తులు వల్ల బాడీ షేమ్‌కు గురయ్యానని చెప్పింది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 4:58 PM GMT
నేను బికినీ ధరించడం అందరికీ సమస్యలా అనిపించింది: నయనతార
X

సూర్య హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గజిని'. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. 2005లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇది తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తనకు లోయెస్ట్ పాయింట్ అని లేడీ సూపర్ స్టార్ నయనతార తెలిపింది. అలానే 'బిల్లా' సినిమాలో బికినీ ధరించడం అప్పట్లో అందరికీ పెద్ద సమస్యలా అనిపించిందని చెబుతోంది.

నయన్ జీవితం ఆధారంగా రూపొందించిన “నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఓ గ్లింప్స్ ను ఓటీటే సంస్థ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో షేర్ చేసింది. ఇందులో నయనతార 'గజినీ' సినిమాలో తాను ధరించిన దుస్తులు వల్ల బాడీ షేమ్‌కు గురయ్యానని చెప్పింది. అయితే అందులో తన తప్పేమీ లేదని, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఏం చెప్పాడో అదే తాను చేశానని తెలిపింది.

“లోయెస్ట్ పాయింట్ 'గజిని' సినిమా. 'ఆమె చాలా లావుగా ఉంది. ఆమె ఎందుకు నటిస్తోంది? అసలు సినిమాలో ఆమె ఎందుకు వుంది?' అని ఆ రోజుల్లో నా మీద కామెంట్లు రావడం నేను చూశాను. మీరు నా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడవచ్చు. కానీ ఎవరూ అలాంటి విషయాలు చెప్పకూడదు. బహుశా నేను బాగా లేకపోవచ్చు. కానీ నేను నా దర్శకుడు ఏమి చేయమని చెప్పాడో అదే చేశాను. అతను నేను ఏమి ధరించాలని కోరుకున్నాడో సరిగ్గా అదే ధరించాను. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయిని. నేను దాని గురించి ఎప్పుడూ చెప్పలేదు” అని నయనతార తెలిపింది.

అజిత్ కుమార్ హీరోగా నటించిన 'బిల్లా' సినిమాలో బికినీ వేయడం గురించి కూడా నయన్ మాట్లాడింది. “నేను చేసిన బికినీ సీన్‌ పైనే మొత్తం డ్రామా నడిచింది. అది ప్రతి ఒక్కరికీ సమస్యలా అనిపించింది. కానీ నేను అనుకున్నాను.. ప్రతీది అలానే కదా మారుతుంది. నిజమే కదా?. నేను ఏదో ప్రూవ్ చేయాలనే ఉద్దేశ్యంతో అలా చేయలేదు, నాకు నా దర్శకుడు చెప్పడంతో ఆ సీన్ చేశాను. సినిమాకి అవసరం కాబట్టి చేసాను. అది నాకు బాగా పని చేసిందని నేను భావిస్తున్నాను” అని నయనతార చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లైనా నయనతార హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు కంటెంట్ ఓరియంటెడ్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజనుకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రక్కయీ, టెస్ట్, మన్నంగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, తని వరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, మూకుతి అమ్మన్ 2, టాక్సిక్ వంటి 8 చిత్రాల్లో నయన్ నటిస్తోంది.