Begin typing your search above and press return to search.

నయనతార అన్ని కోట్ల డీల్ కుదుర్చుకుందా?

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం "బియాండ్ ది ఫెయిరీ టేల్"

By:  Tupaki Desk   |   21 Nov 2024 3:52 AM GMT
నయనతార అన్ని కోట్ల డీల్ కుదుర్చుకుందా?
X

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం "బియాండ్ ది ఫెయిరీ టేల్". ఆమె 40వ పుట్టినరోజును పురస్కరించుకుని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హీరో ధనుష్ తో వివాదం కారణంగా ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు కావాల్సినంత పబ్లిసిటీ దొరికింది. మహేష్ బాబు లాంటి పలువురు స్టార్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో జనాల దృష్టి ఈ ఫిల్మ్ మీద పడింది.

'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీలో ఆమె సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితంలోని కీలకమైన అంశాలను ఒక కథగా చూపించారు. ఇందులో నయన్ ఫ్యామిలీ వివరాలు, కాలేజీ డేస్ లో పార్ట్‌టైమ్‌గా మోడలింగ్ చేయడం, ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా సినిమా ఛాన్స్ రావడం, సినీ కెరీర్ లో ఎదుర్కొన ఇబ్బందులు, లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన వైనం, డేటింగ్ లైఫ్ ను కవర్ చేశారు. అలానే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పరిచయం, ప్రేమాయణం, పెళ్ళికి ముందు వీరి లైఫ్ లో జరిగిన విషయాలు, వివాహ బంధంలో అడుగుపెట్టడం, పెళ్ళి సంగతులను ప్రముఖంగా చర్చించారు.

అయితే నయనతార తన డాక్యుమెంటరీ రూపొందించడానికి భారీ ఓటీటీ డీల్ కుదుర్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ.25 - 30 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా నయన్ - విఘ్నేష్ శివన్ దంపతులు తమ వ్యక్తిగతమైన పెళ్ళి హక్కులను కూడా విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఈ వెడ్డింగ్ కి మీడియాని కూడా అనుమతించలేదని, వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియోలు ఫోటోలు బయటకు రాలేదని టాక్.

నయనతార డాక్యుమెంటరీకి అమిత్ కృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు 1 గంట 22 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆమె తల్లి ఓమన కురియన్, సోదరుడు లెను కురియన్, భర్త విఘ్నేష్ శివన్‌తో పాటు అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, రాధికా శరత్‌ కుమార్, విజయ్ సేతుపతి, తాప్సీ, తమన్నా భాటియా వంటి సినీ సెలబ్రిటీలు భాగం అయ్యారు. నయన్ తో తనకున్న అనుబంధాన్ని, ఆమెపై ఉన్న అభిప్రాయాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీపై పలువురు పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఏమంత గొప్పగా లేదని, ఎమోషన్స్ పండలేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే, నయనతార డాక్యుమెంటరీలో 'నాను రౌడీ దాన్' సినిమా క్లిప్పింగ్స్ ఉపయోగించుకోడానికి నిర్మాత ధనుష్ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆయన పర్మిషన్ లేకుండానే 3 సెకెండ్ల బీటీఎస్ విజువల్స్ ను ట్రైలర్ లో వాదినందుకు, ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించినట్లుగా నయన్ తెలిపింది. ఈ మేరకు మూడు పేజీల ఓపెన్ లెటర్ రాసి ధనుష్ మీద తీవ్ర విమర్శలు చేసింది. నయనతార పోస్టును లైన్ చేయడం ద్వారా చాలా మంది హీరోయిన్లు ఆమెకు మద్దతు తెలిపారు. దీనిపై ధనుష్ స్పందించనప్పటికీ, సోషల్ మీడియాలో ఆయనకు సపోర్టు లభిస్తోంది. కొసమెరుపు ఏమిటంటే, 'బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' లో 'నేనూ రౌడీనే' సెట్స్ లోని 37 సెకండ్ల విజువల్స్ ను ఉపయోగించారు