Begin typing your search above and press return to search.

వామ్మో న‌య‌న్.. చెవులు చీరేస్తున్నా నొప్పే లేదా!

త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌తో ద‌శాబ్ధాల పాటు అల‌రిస్తూనే ఉంది న‌య‌న‌తార‌.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:30 AM GMT
వామ్మో న‌య‌న్.. చెవులు చీరేస్తున్నా నొప్పే లేదా!
X

త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌తో ద‌శాబ్ధాల పాటు అల‌రిస్తూనే ఉంది న‌య‌న‌తార‌. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో త‌న కోసం వేచి చూసే అభిమానుల‌ను సంపాదించుకుంది. త‌మిళ‌నాడులో త‌లైవిగా గౌర‌వం అందుకుంది ఈ ప్ర‌తిభావ‌ని. ద‌క్షిణాదిన ఎదురేలేని నంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది. న‌యన్ నేటిత‌రంతో పోటీప‌డుతూ ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ లోను నిరంత‌రం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ మ‌ల‌యాళ భామ‌ తన భర్త విఘ్నేష్ శివన్ .. పిల్లలు ఉలగం - ఉయిర్‌లతో కలిసి ప్ర‌స్తుతం గ్రీస్‌లో జాలీ సమయాన్ని గడుపుతోంది. కేవ‌లం జాలీగా ఉండ‌ట‌మే కాదు... తన చెవులు కుట్టించుకున్న‌ ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి అంద‌రినీ భ‌య‌పెట్టింది. అది చూస్తుంటే న‌య‌న్ ఫీలింగ్ ఎలా ఉందో కానీ, చూసిన వారికి మాత్రం చెవులు నొప్పిగా బాధ‌గా అనిపించాయి. భ‌య‌పెట్టింది ఆ దృశ్యం.

చెవికి దిద్దుల పెట్టేందుకు సూదితో త‌న డొప్ప చెవుల‌ను పొడిచేస్తుంటే, అది గ‌గుర్పాటుకు గురి చేసింది. చిన్న‌పాటి ఎక్స్ ప్రెష‌న్ మిన‌హా న‌య‌న‌తార క‌ళ్ల‌లో ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ మొత్తం కుట్లు ప్రక్రియ తర్వాత న‌యన్ ఆ ప‌ని విష‌యంలో వృత్తి నిపుణురాలితో సంతృప్తిని వ్యక్తం చూపిస్తుంది. అభిమానులు ఈ వీడియో పోస్ట్‌కి సానుకూలంగా స్పందించారు. ఈ వీడియో పోస్ట్‌పై న‌య‌న్ అభిమానుల నుండి కామెంట్స్ వెల్లువెత్తాయి. పాక్షికంగా మన చేతులతో, పాక్షికంగా విధి చేతులతో రాసిన చిన్న కథల సమాహారం అంటే....మన జీవితం! అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, నాకు ఎందుకు నొప్పిగా ఉంది! అని మ‌రొక అభిమాని కొంటెగా వ్యాఖ్యానించాడు.

`వావ్ వాట్ ఎ ఇయర్స్ #కాదుమా` అనే ట్యాగ్ ని ఈ వీడియోకు జోడించింది. ఆ స‌మ‌యంలో న‌య‌న్ ధైర్యం నిజాయితీని ప్ర‌శంసించాలి. ప్ర‌స్తుతం న‌య‌న్ గ్రీస్ ట్రిప్ కి సంబంధించిన వ‌రుస పోస్ట్ లు వైర‌ల్ గా మారుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్ లో ప్ర‌తిదీ న‌య‌న్ షేర్ చేస్తుంటే వాటిని అభిమానులు ఉత్సాహంగా త‌ర‌చి చూస్తున్నారు. తన చెవులు చిల్లులు పడుతుండడంతో ఉద్వేగంతో పాటు ఉద్విగ్నతకు లోనైన న‌య‌న్ ఫన్ ఫ్యాక్టర్‌కి జోడిస్తూ న‌వ్వులు చిందిస్తూ డ్యాన్సులు చేయ‌డం కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నయనతార మలయాళం సినిమా `ఆవేశం` పాట `ఇల్యూమినాటి`ని ఈ వీడియోకు జోడించింది. నేను పుట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనే అర్థం దీనిలో క‌నిపించింది. చెవికి మూడు చోట్ల కుట్లు వేయాలి. ప్రతి రౌండ్ గడిచేకొద్దీ నటి ఎంత ఉత్సాహంగా ఉందో ఈ వీడ‌యోలో నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నయనతార చెవులు కుట్టించుకున్న తర్వాత పూర్తి సంతృప్తితో అద్దం వైపు చూసుకోవడం కనిపిస్తుంది. రథమారే పాటను చివరి రౌండ్ కుట్ల స‌మ‌యంలో ప్లే చేసింది. కుట్లు వేసిన తర్వాత ఆమె చెవులపై కనిపించిన రక్తపు మర‌క‌ల‌ను తుడిచేయ‌డం క‌నిపించింది.