Begin typing your search above and press return to search.

నా సినిమాలు హిట్‌ కావడానికి వాళ్లే కారణం : నయనతార

ఈ సమయంలో నయనతార మాట్లాడుతూ మరోసారి ధనుష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 4:30 PM GMT
నా సినిమాలు హిట్‌ కావడానికి వాళ్లే కారణం : నయనతార
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార గతంలో పెద్దగా మీడియాలో ఉండేదే కాదు. తన సినిమాల ప్రమోషన్ సమయంలోనూ కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఆసక్తి చూపించదు అనే విమర్శ ఉంది. కానీ గత కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఆమె కనిపిస్తున్నారు. విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్నది మొదలు పలు విషయాలతో ఆమె వార్తల్లో ఉంటున్నారు. ఇప్పుడు ధనుష్‌ ఇష్యూ కారణంగా నయనతార వార్తల్లో ఉంటున్నారు. అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో తన విజువల్స్‌ను వినియోగించారు అంటూ ధనుష్ కోర్టులో కాపీ రైట్‌ దావా వేశారు.

రూ.10 కోట్లు చెల్లించాల్సిందే అంటూ ఆయన కోర్టు ద్వారా నయనతార దంపతులకు నోటీసులు పంపించాడు. దాంతో వివాదం కాస్త చాలా పెద్దది గా మారింది. ముందు ముందు ఈ వివాదం ఎక్కడకి దారి తీస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో నయనతార మాట్లాడుతూ మరోసారి ధనుష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. డైరెక్ట్‌గా ఇండైరెక్ట్‌గా ఏదో ఒక విషయం మాట్లాడుతూ ధనుష్‌ను విమర్శిస్తున్న నయనతార చాలా రోజుల తర్వాత ఇతర విషయాల గురించి మాట్లాడుతూ, వార్తల్లో నిలిచింది.

ఒక ఇంటర్వ్యూలో మీరు నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అంతగా అభిమానం దక్కడంకు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించిన సమయంలో నయనతార స్పందిస్తూ... నన్ను కేవలం నా అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు సైతం అభిమానిస్తారు. వాళ్ళు అంతా నా సినిమాలు చూస్తారు. ఇతర హీరోల యొక్క ఫ్యాన్స్‌ నా సినిమాలపై ఆసక్తి చూపించడం వల్లే నాకు ఇన్ని విజయాలు దక్కుతున్నాయి. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సోషల్‌ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ఎక్కువ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ, సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచిన ముద్దుగుమ్మ నయనతార మరోసారి ఒక భారీ సూపర్‌ హిట్‌ను దక్కించుకోవడం కోసం వెయిట్‌ చేస్తోంది. ఈమధ్య కాలంలో పిల్లల కారణంగా కాస్త సినిమాలకు తక్కువ సమయం కేటాయిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గతంలో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం తక్కువ సినిమాలు చేస్తూ సినీ కెరీర్‌లో అలా అలా ముందుకు సాగుతోంది. చేసిన ప్రతి సినిమాతో హిట్‌ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.