ధనుష్ తో వివాదం.. నయన్ కావాలనే ఇలా చేసిందా?
సౌత్ హీరో హీరోయిన్లు ధనుష్, నయనతార మధ్య వివాదం ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.
By: Tupaki Desk | 20 Nov 2024 3:45 AM GMTసౌత్ హీరో హీరోయిన్లు ధనుష్, నయనతార మధ్య వివాదం ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ధనుష్ ను విమర్శిస్తూ నయన్ ఓపెన్ లెటర్ రాయడంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం బయటకు పొక్కింది. కానీ దీనిపై ధనుష్ ఇంతవరకూ స్పందించలేదు. ఇద్దరిలో ఎవరిది తప్పు అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న తరుణంలో.. నయన్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
నయనతార పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లోని విషయాలతో ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఫిల్మ్ ను రూపొందించారు. దీని కోసం నెట్ ఫిక్స్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారని, పెళ్ళి రైట్స్ అమ్మారని టాక్ ఉంది. ఇక నయన్ తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి చేసిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమాలోని విజువల్స్ ను తన డాక్యుమెంటరీలో పెట్టాలని భావించారు. ఇందుకోసం ఆ మూవీ నిర్మాత అయిన ధనుష్ ను అనుమతి అడిగారట. అయితే రెండేళ్లు గడిచినా అతను ఎన్ఓసీ ఇవ్వలేదంటూ నయన్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేసింది.
ట్రైలర్ లో 3 సెకండ్ల బీటీఎస్ విజువల్స్ వాడినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించమని ధనుష్ లీగల్ నోటీస్ పంపినట్లుగా నయనతార తెలిపింది. ఈ క్రమంలో ధనుష్ క్యారక్టర్ ను విమర్శిస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ విజువల్స్ ను డిలీట్ చేసినట్లుగా కూడా తెలిపింది. అయితే తీరా నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆమె డాక్యుమెంటరీలో చూస్తే.. 'నేనూ రౌడీనే' సినిమా విజువల్స్ కనిపిస్తున్నాయి. 3 సెకండ్లు కాదు, దాదాపుగా 35 నుండి 37 సెకన్ల వీడియో ఫుటేజ్ ఉంది.
నయనతార తన డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమా విజువల్స్ ఉపయోగించినప్పుడు, అసలు ధనుష్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఆమె ఎందుకు ఓపెన్ లెటర్ రాసిందనేది ప్రశ్నార్థకంగా మారింది. 3 సెకండ్ల వీడియోపై లాయర్ నోటీస్ పంపించారని చెప్పి, 30 సెకండ్లకు పైగా విజువల్స్ ను ఎలా వాడారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే, ఇదంతా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీకి హైప్ తీసుకురావడానికే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ పరువును దిగజార్చడానికే కావాలని ఇలా చేసిందని అభిప్రాయ పడుతున్నారు.
ధనుష్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోకుండా, ఆయన బ్యానర్ లో నిర్మించిన సినిమా విజువల్స్ వాడుకోవడం కచ్ఛితంగా కాపీ రైట్ చట్టం కిందికే వస్తుందని, నయనతార దంపతులు నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపడంలో తప్పేమీ లేదని అంటున్నారు. నయన్ ఈ డాక్యుమెంటరీని చారిటీ కోసం చేయలేదు.. ఆమె వ్యక్తిగతమైన పెళ్లితో బిజినెస్ చేసిందని విమర్శిస్తున్నారు. అందుకే తన వివాహానికి మీడియాని, బంధుమిత్రులని ఎవరినీ ఆహ్వానించలేదని.. దీన్ని నెట్ ఫిక్స్ కు సేల్ చేసుకోడానికి రజనీకాంత్, షారుక్ ఖాన్ లాంటి ఫిలిం స్టార్స్ ను ఇన్వైట్ చేసిందని ట్రోల్ చేస్తున్నారు.
నయనతార డాక్యుమెంటరీ కోసం తన మ్యారేజ్ రైట్స్ ను అమ్మి సొమ్ము చేసుకున్నప్పుడు.. ధనుష్ కూడా అలా ఆలోచించడంలో తప్పు లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ధనుష్ తన డబ్బులతో సినిమా తీసినప్పుడు, సర్వ హక్కులు అతనికే ఉంటాయి. అలాంటప్పుడు ఆయన అనుమతి లేకుండా అందులోని విజువల్స్ యూజ్ చెయ్యడం ముమ్మాటికీ తప్పేనని, కాపీ రైట్ చట్టం కింద అతనికి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇలా నయన్ పై ధనుష్ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు మాత్రం నయనతార రాసిన లెటర్ కు మద్దతు తెలిపారు