Begin typing your search above and press return to search.

నయన్ బ్లాక్ అండ్ వైట్ గ్లామర్ లుక్.. స్టన్నింగ్

ఈ ఫోటోల్లో ఆమె సొగసుతో పాటు, ఆత్మవిశ్వాసం హైలెట్ అవుతోంది. మృదువైన రూపంతో సింపుల్ లుక్‌లో కనిపించినా, ఆమె స్టైల్ అభిమానులందరినీ ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 8:15 AM IST
నయన్ బ్లాక్ అండ్ వైట్ గ్లామర్ లుక్.. స్టన్నింగ్
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార తన అందం, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు నయనతార అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. చాలా అరుదుగా ఆమె గ్లామర్ స్టిల్స్ వదులుతూ ఉంటుంది. ఇక తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న నయనతార, ప్రతిసారీ సరికొత్తగా కనిపిస్తూ ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్‌గా మారుతోంది.

ఈ ఫోటోల్లో ఆమె సొగసుతో పాటు, ఆత్మవిశ్వాసం హైలెట్ అవుతోంది. మృదువైన రూపంతో సింపుల్ లుక్‌లో కనిపించినా, ఆమె స్టైల్ అభిమానులందరినీ ఆకట్టుకుంది. నయనతార తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి, నటన తో ప్రతిభను నిరూపించుకుంది. మొదట్లో కొంత కాలం సపోర్టింగ్ రోల్స్ చేసి, టాలెంట్‌తో నెమ్మదిగా ప్రధాన కథానాయిక పాత్రల వరకూ ఎదిగింది.

తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘చంద్రముఖి,’ ‘బిల్లా,’ ‘మాయా,’ ‘అరమన్,’ వంటి చిత్రాలతో ఆమె అద్భుతమైన నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం, బోల్డ్ పాత్రలను ప్రదర్శించడంలో ఆమె ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రతి సినిమాలోను తన పాత్రకు తగిన అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

కేవలం హీరోయిన్‌గా కాకుండా, తన నటనకు ఛాలెంజ్‌గా భావిస్తూ ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ముందుకొస్తుంది. నయనతారను అభిమానులు ‘లేడీ సూపర్ స్టార్’గా గౌరవిస్తారు. ఇటీవల ఆమె నటించిన ‘జవాన్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో క్రేజ్ అందుక్కున్నాయి. కెరీర్‌లో దశాబ్దాల తరువాత కూడా తన క్రేజ్ అలాగే కొనసాగిస్తూ, కొత్త తరం హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నయనతార ప్రతి ఫోటోషూట్‌తో పాటు తన వ్యక్తిత్వంలో ఉన్న గంభీరతను, కట్టిపడే అందాన్ని ప్రదర్శిస్తూ మరోసారి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతుంది.