తలైవి అదే గాంభీర్యం మంత్రముగ్ధం
ప్రఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోజులిచ్చిన నయన్, తన ఇంటర్వ్యూలో చాలా గమ్మత్తయిన విషయాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 30 March 2025 3:15 AM''నువ్వు చేసే పనిలో నిజాయితీగా ఉండు. నీ పని నువ్వు బాగా చెయ్యి.. ఆడియెన్ కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరూ నీతో ప్రేమలో పడతారు.. నిన్ను సెలబ్రేట్ చేస్తారు.. అది నీ జీవితంలో గొప్ప జాయ్ గా మారుతుంది'' అంటూ మంచి విషయాన్ని చెప్పింది నయనతార. ప్రఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోజులిచ్చిన నయన్, తన ఇంటర్వ్యూలో చాలా గమ్మత్తయిన విషయాలను వెల్లడించారు.
'మార్చి' ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ కవర్ షూట్ కోసం సరిహద్దులు దాటి ఎదిగిన నయనతార తన విషయాలను షేర్ చేసారని హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. ముఖ్యంగా నయనతార కవర్ ఫోటోషూట్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తలైవి అదే గాంభీర్యం.. మృధువైన స్మైలీ ఫేస్ తో ఆకర్షిస్తోందని ప్రశంసలు కురుస్తున్నాయి.
బ్లాక్ షర్ట్.. దానికి కాంబినేషన్ గా షిమ్మరీ బాటమ్ తో నయన్ ఎంతో అందంగా కనిపించింది. అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూనే, ట్రెడిషన్ ని బ్రేక్ చేయకుండా తనదైన సిగ్నేచర్ స్మైల్ తో మరింత బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయింది. నయనతార ఎంపిక చేసుకున్న వాచ్, చేతికి గాజులు, ఉంగరాలు ప్రతిదీ తనలోని యూనిక్ నెస్ ని మరింత ఎలివేట్ చేసాయి. ముఖ్యంగా లుక్ ఏదైనా నయనతారలోని గాంభీర్యం ఎప్పుడూ చెక్కు చెదరదు. అదే తన ప్రత్యేకత. నయన్ తదుపరి పలు భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు కథలు వింటోందని సమాచారం.