Begin typing your search above and press return to search.

లేడీ సూప‌ర్ స్టార్ బాదుడు ఆ రేంజ్ లోనా?

ఒక్కో సినిమాకు 10 కోట్ల‌కు పైగానే పారితోషికం అందుకుంటుంది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 7:30 AM GMT
లేడీ సూప‌ర్ స్టార్ బాదుడు ఆ రేంజ్ లోనా?
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగానూ స‌త్తా చాటుతుంది. కేవ‌లం కోలీవుడ్ సినిమాలు మాత్ర‌మే అంటూ అక్క‌డే ప‌నిచేస్తోంది. అప్పుడ ప్ప‌డు మాత్రం ప‌ర‌భాషా చిత్రాలు చేస్తోంది. ఆ ర‌కంగా ఇండియా వైడ్ ఫేమ‌స్. ఈ విష‌యంలో అమ్మ‌డు తెలివిగా త‌న క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటుంది. ఒక్కో సినిమాకు 10 కోట్ల‌కు పైగానే పారితోషికం అందుకుంటుంది.


ఈ రేంజ్ లో సౌత్ నుంచి పారితోషికం అందుకుంటోన్న ఒకే ఒక్క నాయిక. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇదే విధానంలో అమ్మ‌డి జ‌ర్నీ సాగుతుంది. పారితోషికం కాకుండా అద‌నంగా ఇంకా అన్నిర‌కాల సౌక‌ర్యాలు కేటాయించాలి. స్పెష‌ల్ ఫ్లైట్..త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఇలా అన్నింటిని నిర్మాత మోయాల్సిందే. న‌య‌న్ ఎన్ని రోజులు షూటింగ్ కి హాజరైతే అన్ని రోజులు అన్నీ ర‌కాల సౌక‌ర్యాలు త‌ప్ప‌నిస‌రిగా క‌ల్పించాలి.

ఇక ఇదే క్రేజ్ తో ఎండార్స్ మెంట్ విష‌యంలోనూ అదే దూకుడు చూపిస్తోంది. ఫాంలో ఉన్న‌ప్పుడు అవ‌కాశాలు అనే అంశాన్ని అవ‌పోశాన ప‌ట్టేసింది. దీంతో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏ కంపెనీని వ‌ద‌ల‌దు. అలాగ‌ని తీసుకునే పారితోషికం విష‌యంలో రాజీ ప‌డ‌దు. ఒక్కో యాడ్ కి ఐదు కోట్లు ఛార్జ్ చేస్తోందిట‌. దీంతో న‌య‌న్ పేరిట ఇదోరికార్డుగా మారింది. యాడ్స్ కోసం ఇంత‌వ‌ర‌కూ ఈ రేంజ్ లో ఏ హీరోయిన్ ఇంత మొత్తంలో పారితోషికం తీసుకోలేదు.

కోటి నుంచి మూడు కోట్ల మ‌ధ్య‌లోనే ఉన్నారు. అతి క‌ష్టం మీద ఓ ఇద్ద‌రు భామ‌ల‌కే అది ఆఫ‌ర్ చేస్తున్నారు. మిగ‌తా వారంతా కోటిన్న‌ర లోపే. అయితే న‌య‌న‌తార‌కు మాత్రం ఐదు కోట్ల‌తో టాప్లో కొన‌సాగుతుంది. ఓ కంపెనీ కేవ‌లం 50 సెకెన్ల యాడ్ కోస‌మే ఇంత మొత్తం ఛార్జ్ చేస్తోందిట‌.