సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన నయనతార
నయనతార ప్రధాన పాత్రలో రానున్న మూకుతి అమ్మన్2 ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.
By: Tupaki Desk | 6 March 2025 3:57 PM ISTనయనతార ప్రధాన పాత్రలో రానున్న మూకుతి అమ్మన్2 ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. చెన్నైలో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో నయనతారతో పాటూ మీనా, ఖుష్బూ, రెజీనా పాల్గొనగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
మామూలుగా సినిమా ఓపెనింగ్స్, ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ఓపెనింగ్ కు హాజరవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన సినిమాల ప్రమోషన్స్ కు సైతం నయనతార ఎప్పుడు హాజరైంది లేదు. కానీ ఈ మైథాలజీ మూవీ కోసం నయనతార తన సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మరీ ఈ ఈవెంట్ లో పాల్గొంది.
నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 22 ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ నయన్ తను నటించిన సినిమాల ప్రమోషన్స్ కు వచ్చింది లేదు. సినిమా ఒప్పుకుని ప్రాజెక్టుకు సైన్ చేసినప్పుడే ప్రమోషన్స్ కు రాననే విషయాన్ని కూడా నయనతార అగ్రిమెంట్ లో స్పెషల్ గా మెన్షన్ చేస్తుందనే విషయం తెలిసిందే. అలాంటి నయన్ ఇప్పుడు ఈ సినిమా ఓపెనింగ్‌కు హాజరవడం వెనుక రీజనేంటని షాకవుతున్నారు.
దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. అయితే ఈ పూజ జరిగింది కూడా సినిమా సెట్స్ లోనే. పూజా కార్యక్రమాలతో పాటూ సినిమా ఫస్ట్ షాట్ ను కూడా ఇవాళ షూట్ చేయాలని అనుకోవడం వల్లే నయనతార ఈ కార్యక్రమానికి హాజరైందని తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే 2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన మూకుతీ అమ్మన్ కు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది.
కాకపోతే ఈసారి కాస్త గ్రాండ్ స్కేల్ లో సినిమాను తీయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సుందర్.సి దగ్గరకు వెళ్లింది. నెల రోజుల్లోనే ఈ సినిమాకు సుందర్ కథను రెడీ చేశాడని, ఇలాంటి కథ ఈ మధ్య కాలంలో వినలేదని, నయనతార ఈ సినిమాలో కూడా అమ్మవారి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. గతంలో మూకుతీ అమ్మన్ సినిమా చేసినప్పుడు ఎలాగైతే నయన్ ఉపవాసం చేసిందో ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా నయన్ ఉపవాసం చేస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనున్నట్టు నిర్మాత గణేష్ తెలిపారు.