యశ్ టాక్సిక్.. రంగంలోకి లేడి సూపర్ స్టార్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో యశ్‌తో పాటు నయనతారతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటానని చెప్పాడు.
By: Tupaki Desk | 24 Jan 2025 3:30 PM GMTసూపర్ స్టార్ యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా రానున్న టాక్సిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గీతూ మొహందాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, న్యారేషన్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపికలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్‌ని తీసుకోవాలని మేకర్స్ భావించారు.
అయితే రేమ్యునరేషన్ మరియు ఇతర కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు సమాచారం. ఆ పాత్ర సినిమాలో చాలా స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక యశ్ కు జోడిగా కీయరా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. కియారా ప్రస్తుతం యశ్‌తో కలిసి గోవాలో పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
ఇక బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబెరాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో యశ్‌తో పాటు నయనతారతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటానని చెప్పాడు. దీంతో నయనతార ఈ సినిమాలో భాగం కావడం పైన స్పష్టత వచ్చింది. ముందుగా కరీనా కపూర్ కోసం రాసుకున్న పాత్రకు ఇప్పుడు నయనతారను ఎంపిక చేశారట.
ఆమధ్య పాన్ ఇండియా చిత్రం జవాన్ తో ప్రేక్షకులను మెప్పించిన నయనతార, ఇప్పుడు యశ్ వంటి పాన్ ఇండియా హీరోతో కలిసి స్క్రీన్‌పై మెరవబోతోంది. నయనతార కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకురాబోతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా కథ విషయానికొస్తే, యశ్ ఈసారి పూర్తి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.
కథ, మేకింగ్ రెండూ విభిన్నంగా ఉండబోతాయని టాక్. గీతూ మొహందాస్ డిఫరెంట్ డైరెక్షన్ ఈ సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా చేయబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టాక్సిక్ సినిమాకు నయనతార క్రేజ్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. యశ్-నయనతార కాంబినేషన్ ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల కానుంది.