Begin typing your search above and press return to search.

జీవితాన్ని మార్చిన సినిమా.. నయన్ స్పెషల్ పోస్ట్..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 8:30 AM GMT
జీవితాన్ని మార్చిన సినిమా.. నయన్ స్పెషల్ పోస్ట్..!
X

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఆమె ఇలా వచ్చి తన మెసేజ్ లతో అలరిస్తుంది. లేటెస్ట్ గా నేను రౌడీనే సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సినిమా డైరెక్టర్ భర్త విఘ్నేష్ శివన్ కు థాంక్స్ చెప్పింది నయన్. ఇంతకీ నయనతార ఏమని రాసుకొచ్చింది అంటే.. నేను రౌడీనే నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా... నా కెరీర్ ను మలచిన సినిమా.. 9 ఏళ్ల క్రితం రిలీజై విజయం సాధించిన ఈ సినిమాను ఎన్నో మర్చిపోలేని అనుభూతులను ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చినందుకు విఘ్నేష్ కు థాంక్స్. ఈ సినిమా నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నా అని రాసుకొచ్చారు. అంతేకాదు ఫైఅల్ గా ఈ సినిమా నాకు విఘ్నేష్ ను ఇచ్చిందని కామెంట్ పెట్టారు.

నేను రౌడీనే 9 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా విఘ్నేష్ శివన్ నయనతార బంధానికి నాంది పడేలా చేసింది. విఘ్నేష్ శివన్ ఈ సినిమా కథ ధనుష్ కి చెబితే నయనతార అయితే బాగుంటుందని ఆయనే రిఫర్ చేశారట. అలా నయన్ కు కథ చెప్పగానే ఆమెకు నచ్చి సినిమా ఓకే చేసింది. ఏడాది పాటు షూటింగ్ టైం లో నయనతార తో కలిసి ట్రావెల్ చేయడంతో ఆమెకు దగ్గరయ్యారు విఘ్నేష్ శివన్.

ఆ తర్వాత ఇద్దరు కలిసి కొన్నాళ్లు లవ్ జర్నీ చేసి ఫైనల్ గా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గా విఘేష్, హీరోయిన్ గా నయనతార ఓ పక్క సినిమాలు చేస్తూనే ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. నయనతార ఇన్నాళ్లు సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో అదరగొట్టేసింది. లాస్ట్ ఇయర్ జవాన్ తో బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నా నయనతార మాత్రం తమిళ సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.

నయనతార నాన్ రౌడీ దా తెలుగు వెర్షన్ నేను రౌడీనే సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా తర్వాతనే నయన్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాల వేగం పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఆమె ఆ సినిమా లైఫ్ లో స్పెషల్ అని చెబుతుంది.