అశ్రద్ద అత్యంత ప్రమాదమని ఆ ఇద్దరికీ తెలిసేదెప్పుడు?
లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగు, హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నా? నిర్మొహ మాటంగా తిరస్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో టాలీవుడ్ లో కాదనలేక కొన్ని సినిమాలు చేసింది గానీ లేదంటే ? వాటిలో కూడా నటించే అవకాశం లేదు.
By: Tupaki Desk | 23 Feb 2025 11:30 PM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగు, హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నా? నిర్మొహ మాటంగా తిరస్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో టాలీవుడ్ లో కాదనలేక కొన్ని సినిమాలు చేసింది గానీ లేదంటే ? వాటిలో కూడా నటించే అవకాశం లేదు. డిమాండ్ చేసినంత ఇస్తామన్నా? నో అనే చెబుతుంది. కొంత కాలంగా అమ్మడు మలయాళం, తమిళ సినిమాల్లోనే కొనసాగుతుంది.
వాస్తవానికి ఆ రెండు పరిశ్రమల్లో పారితోషికాలు తక్కువే. ఒక్క తెలుగు సినిమా చేస్తే మాలీవుడ్ కంటే రెట్టించిన రెమ్యునరేషన్ తెలుగు సినిమాల ద్వారా వస్తుంది. కానీ నయనతార పారితోషికం కంటే కంపర్ట్ మాత్రమే ముఖ్యమని ముందుకెళ్తుంది. ఇక సమంత కూడా ఏడాదిన్నర కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. `ఖుషీ` తర్వాత అమెరికా వెళ్లిన అమ్మడు అటు నుంచి ముంబైలో ల్యాండ్ అయింది.
మధ్యలో ఓసారి హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ముంబైలోనే ఉంటుంది. బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. అమ్మడు ఇంత వరకూ ఒక్క బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో కూడా లాక్ అవ్వలేదు. కానీ సమంత చేయాలి? గానీ అవకాశాలివ్వడానికి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలన్నీ క్యూలో ఉన్నాయి. ఆ మధ్య త్రివిక్రమ్ కూడా సమంతని తెలుగు సినిమాలు చేయండి రిక్వెస్ట్ చేసాడు.
అయినా సరే ఆ వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంది. మరి సమంత, నయనతారలు తెలుగు సినిమాలను ఎందుకు అశ్రద్ద చేస్తున్నట్లు? ఆ భామలిద్దరి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇద్దరి అంతరంగాల్లో టాలీవుడ్ పై అభిప్రాయం ఏంటి? అన్నది చూడాలి. కానీ వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా వదులుకుంటే మళ్లి వెను దిరిగి చూసినా ఆ ఛాన్సులు రావు అన్నది గుర్తించాల్సిన విషయం. ఇలా జెబ్బలు ఎగరేసిన భామలెంతో మంది నేడు ఖాళీగా ఉంటున్నారు? అన్నది గుర్తించాలి.