Begin typing your search above and press return to search.

ఉడ్ హౌస్‌లో న‌య‌న‌తార స్ట‌న్నింగ్ లుక్

తాజాగా ఉడ్‌హౌస్‌లో స్పెష‌ల్ ఫోటోషూట్‌తో హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ముఖ్యంగా డార్క్ గ్రీన్ క‌ల‌ర్ చీర‌లో న‌య‌న్ ఎంతో అద్భుతంగా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 2:30 PM GMT
ఉడ్ హౌస్‌లో న‌య‌న‌తార స్ట‌న్నింగ్ లుక్
X

అందాల న‌య‌న‌తార బికినీ ధ‌రించినా లేదా స్విమ్ సూట్ లో అందాలు ఆర‌బోసినా అది అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇంత‌కుముందు త‌ళా అజిత్ తో క‌లిసి న‌టించిన ఆరంభం చిత్రంలో స్ట‌న్నింగ్ బికినీలో మైమ‌రిపించిన న‌య‌న్, అంత‌కుముందు బిల్లా చిత్రంలోను స్విమ్మింగ్ పూల్ సీన్ లో దుమారం రేపింది.

ఇప్పుడు అందుకు భిన్న‌మైన శారీ లుక్ లోను అద‌ర‌గొట్టింది. న‌య‌న్ గ‌త కొంత‌కాలంగా స్టార్ హీరో ధ‌నుష్ తో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ లుక్ అభిమానుల‌కు చాలా రీఫ్రెషింగ్ ట్రీట్ అని చెప్పాలి. ఓవైపు న‌య‌న‌తార‌- విఘ్నేష్ ల‌పై ధ‌నుష్ అభిమానుల సోష‌ల్ మీడియా వార్ న‌డుస్తోంది. ఈ అంద‌మైన జంట డాక్యు సిరీస్ లో త‌న సినిమా క్లిప్ ఉప‌యోగించుకున్నందుకు ధ‌నుష్ న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించడంతో వారి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌దైంది.

అదంతా అటుంచితే.. న‌య‌న‌తార మారుతున్న వాతావ‌ర‌ణాన్ని లైట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా ఉడ్‌హౌస్‌లో స్పెష‌ల్ ఫోటోషూట్‌తో హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ముఖ్యంగా డార్క్ గ్రీన్ క‌ల‌ర్ చీర‌లో న‌య‌న్ ఎంతో అద్భుతంగా క‌నిపిస్తోంది. సాంప్ర‌దాయం ఉట్టిప‌డుతూనే న‌య‌న్ త‌న‌లోని బోల్డ్ యాంగిల్ ని కూడా ఈ లుక్ లో ఎలివేట్ చేసింది. త‌న అంద‌మైన క‌ర్లీ శిరోజాల‌ను గాలికి ఆర‌బోస్తూ.. డిజైన‌ర్ శారీలో ఎంతో అందంగా క‌నిపించింది. . చెట్లు ఆకులతో ఉడ్ హౌస్ ఎంత అందంగా ఉందో, న‌య‌న్ ప్ర‌వేశంతో అంతే డిగ్నిఫైడ్ గా ఆ వెద‌ర్ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్‌ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

డాక్యు సిరీస్ లో ప్రేమ‌క‌థ‌:

న‌య‌న్ - విఘ్నేష్ గ‌తంలోకి వెళితే.. 9 జూన్ 2022న మహాబలిపురంలో విఘ్నేష్‌- న‌య‌న్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి షారూఖ్ ఖాన్, రజనీకాంత్, AR రెహమాన్ వంటి దిగ్గజాలు హాజర‌య్యారు. డాక్యు సిరీస్ ప్ర‌చార‌ వీడియోలో.. నయనతార మొదటిసారిగా విఘ్నేష్‌ను వేరే కోణంలో ఎలా చూసింది? అనేదానిపై హృద‌యాల‌ను తాకే జ్ఞాపకాన్ని షేర్ చేసింది. పాండిచ్చేరిలో షూటింగ్ సమయంలో విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేస్తున్న విఘ్నేష్ లోని ఆక‌ర్షణ తనను మంత్రంలా తాకినట్లు గుర్తుచేసుకుంది. స‌డెన్‌గా విఘ్నేష్ ఒక భిన్న‌మైన వ్య‌క్తి అని గమనించినట్లు అంగీకరించింది. అతడిని అందమైన వ్యక్తి అని అభివర్ణించింది. ఫిలింమేకింగ్ లో అతడి విధానాన్ని న‌య‌న‌తార‌ మెచ్చుకుంది. అదే క్లిప్‌లో విఘ్నేష్ తన దృక్పథాన్ని బయటపెట్టాడు. అతడు మొదట్లో `నయన్ మేడమ్` ప్రతిభ, వృత్తిగ‌త నైపుణ్యాన్ని ప్ర‌శంసించాడు. కాలక్రమేణా త‌మ మ‌ధ్య‌ సంభాషణలు లోతుగా మారాయి. త‌మ మ‌ధ్య ప్రత్యేక సంబంధాన్ని విఘ్నేష్ -నయ‌న్ నెమ్మ‌దిగా గ్రహించారు. మొత్తానికి డాక్యుమెంట‌రీలో వారి ప్రేమ‌క‌థ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.