టెస్ట్ నుంచి నయన్ స్పెషల్ వీడియో
ఈ నేపథ్యంలో టెస్ట్ మూవీలో నయనతార పాత్రను పరిచయం చేస్తూ చిత్ర మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 14 March 2025 3:36 PM ISTవరుస సినిమాలతో దూసుకెళ్తున్న నయనతార నటిస్తున్న తాజా చిత్రం టెస్ట్. ఈ సినిమాలో నయన్ కుముధ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో శశికాంత్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో టెస్ట్ ఏప్రిల్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టెస్ట్ మూవీలో నయనతార పాత్రను పరిచయం చేస్తూ చిత్ర మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. కుముధ కల ఏంటనే విషయాన్ని వివరిస్తూ రిలీజైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించనుండగా, మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపించనుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో కచ్ఛితంగా ఓ మలుపు ఉంటుంది. లైఫ్ లో అదే అసలైన టెస్ట్ అనే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు ఫ్యామిలీ మ్యాన్ రచయిత సుమన్ కుమార్ కథ అందించారు. వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు శక్తి శ్రీ గోపాలన్ సంగీతం ఇచ్చారు. చెన్నై స్టేడియంలో ఇండియన్ టీమ్ ఓ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ కారణంగా ముగ్గురి జీవితాలు ప్రభావితమౌతాయి. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన వాళ్లు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు? ఆ సమస్యలను వారు ఎలా అధిగమించారనే నేపథ్యంలో టెస్ట్ తెరకెక్కింది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 2024 లోనే అయిపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందుకే సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడైంది. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ముగ్గురూ మంచి యాక్టర్లవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.