Begin typing your search above and press return to search.

లేడీ సూపర్ స్టార్ క్రేజీ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీలోనే..

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నేరుగా డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 Oct 2024 9:34 AM GMT
లేడీ సూపర్ స్టార్ క్రేజీ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీలోనే..
X

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నేరుగా డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. బిగ్ స్క్రీన్ పై వర్క్ అవుట్ కావు అనుకున్న సినిమాలని డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే కొన్ని మూవీస్ కి ఓటీటీ హక్కుల ద్వారా పెట్టిన పెట్టుబడి మొత్తం రికవరీ అయితే థీయాట్రికల్ రిలీజ్ టెన్షన్ తప్పించుకోవడానికి నిర్మాతలు ఓటీటీలో విడుదలకి మొగ్గు చూపిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని సినిమాలని ఓటీటీ సంస్థలు తమ ఒరిజినల్ వెంచర్స్ గా నిర్మించడంతో థియేటర్స్ లోకి రావడం లేదు.

2020 తర్వాత ఓటీటీ లకి ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు కూడా కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెట్టి సినిమాల డిజిటల్ రైట్స్ కొనుకోలు చేస్తున్నాయి. డిజిటల్ బిజినెస్ నిర్మాతలకి వరంగా మారింది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ మూవీని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఇండియన్ 2’ మూవీ డిజాస్టర్ కావడంతో ఆ ఇంపాక్ట్ ‘ఇండియన్ 3’ థీయాట్రికల్ బిజినెస్ మీద గణనీయంగా పడింది.

ఒకవేళ ‘ఇండియన్ 3’ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే మాత్రం కచ్చితంగా భారీ నష్టాలు భరించాల్సి వస్తుందని భావించిన మేకర్స్ ఓటీటీ రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు కోలీవుడ్ లో మరో క్రేజీ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతోందనే ప్రచారం నడుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా వైనాట్ స్టూడియోస్ మీద సినిమాలు నిర్మిస్తోన్న ఎస్ శశికాంత్ దర్శకుడిగా మారి ‘టెస్ట్’ అనే మూవీ చేశాడు.

ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్ధ్, మీరా జాస్మిన్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఫైనల్ డిస్కషన్ ఒక కొలిక్కి వస్తే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయిపోవచ్చని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో టెస్ట్ మ్యాచ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఇలా కోలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యం అని చెప్పొచ్చు. ఇది వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది.