Begin typing your search above and press return to search.

హ‌బ్బీతో న‌య‌న్ ఎంతో ఆప్యాయంగా!

విగ్నేష్ శివ‌న్-న‌య‌న‌తార‌ల దంప‌తుల మ‌ధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   13 July 2024 12:45 PM GMT
హ‌బ్బీతో న‌య‌న్ ఎంతో ఆప్యాయంగా!
X

విగ్నేష్ శివ‌న్-న‌య‌న‌తార‌ల దంప‌తుల మ‌ధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రోఫెష‌న‌ల్ గా ఎంత బిజీగా ఉన్నా? ఫ్యామిలీ లైఫ్ కంటూ కొంత స్పేస్ కేటాయించుకుని రేర్ గా వెకేష‌న్లుకు వెళ్తుంటారు. 10-15 రోజుల పాటు విదేశాల్లో చిల్ అవుతుంటారు. ఆ మూవ్ మెంట్స్ ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేస్తుంటారు. తాజాగా న‌య‌న్-విగ్నేష్ మ‌ధ్య బాండింగ్ ని రివీల్ చేస్తూ మ‌రో ఫోటోని షేర్ చేసారు. ఇదిగో ఇక్క‌డిలా భ‌ర్త ప్రేమ‌లో న‌య‌న్ మునిగిపోయింది.


ఈ ఫోటో సెష‌న్ లో ఇద్ద‌రు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించారు. ష‌ర్ట్..పంచెను విగ్నేష్ ధ‌రించ‌గా, అదే రంగు చీర‌లో న‌య‌న‌తార త‌ళుకులీనింది. చీర మ్యాచింగ్ మెడ‌లో డిజైన‌ర్ యాక్స‌రీస్ ధ‌రించింది. హెయిర్ మాత్రం ద‌గ్గ‌ర‌కు తీసి కొప్పులా ముడేసింది. విగ్నేష్ న‌య‌న్ ని ప్రేమ‌తో ద‌గ్గ‌ర‌కు తీసుకుని చేతిలో చేయి వేసి..నుదిటిపై ప్రేమ‌తో ముద్దు పెట్టాడు. ఈ స‌మ‌యంలో ఇద్ద‌రు క‌ళ్లు మూసుకుని ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను పంచుకున్నారు.


ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రు సంప్ర‌దాస్తుల్లో ఎంతో అందంగా ఉన్నారంటూ నెటి జ‌నులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పెళ్లైన త‌ర్వాత ఇద్ద‌రు ఇలా క‌నిపించడం ఇదే తొలిసారి. క‌నుల‌కు ఎంతో విందుగా ఉందంటూ న‌య‌న్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక వృత్తి ప‌రంగా ఎవ‌రి ప‌నిలో వాళ్లు బిజీగా ఉన్నారు. ద‌ర్శ‌కుడిగా విగ్నేష్ శివ‌న్...న‌టిగా నయ‌న్ బిజీగా ఉన్నారు.


ప్ర‌స్తుతం న‌య‌న‌తార త‌మిళ్ తో పాటు మ‌ల‌యాళంలోనూ సినిమాలు చేస్తోంది. ఓ ప‌ది సినిమాల వ‌ర‌కూ సెట్స్ లో ఉన్నాయి. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉండ‌గా, మ‌రికొన్ని ఆన్ సెట్స్ లో ఉన్నాయి.