నయనతార బాలీవుడ్ ప్లానింగ్ ఎలా?
బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా షారుక్ ఏరికోరి మరీ నయన్ దించారు. ఇక్కడే నయనతార సగం సక్సెస్ అయింది.
By: Tupaki Desk | 12 Sep 2023 12:30 AM GMTనయనతార టాలీవుడ్..కోలీవుడ్ లో సాధించాల్సిందంతా సాధించేసింది. తెలుగులో అవకాశాలు వస్తున్నా చాలా సెలక్టివ్ గా చేస్తోంది. విఘ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న తర్వాత కోలీవుడ్ లో కూడా అంతే సెలక్టివ్ గా వెళ్తోంది. తాను చేసే ఏ సినిమా అయినా తన బ్రాండ్ ఉండేలా చూసుకుంటుంది. కమర్శియల్ చిత్రాలకంటే లేడీ ఓరియేంటెడ్ నాయికగా సత్తా చాటాలని చూస్తోంది. ఈ రెండు పరిశ్రమలో అమ్మడు ఆ రకంగా జర్నీ సాగిస్తుంది. ఈ నేపథ్యంలో నయనతార జర్నీ ఎలా ప్లాన్ చేస్తుంది? అన్నది ఆసక్తికరం.
ఇటీవలే 'జవాన్' సినిమాతో హిందీలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. జవాన్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. తొలి సినిమాతోనే ఓ రేంజ్ లో సత్తా చాటింది. షారుక్ సరసన తగ్గ నాయిక అని నిరూపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఇప్పుడక్కడ ప్రోజక్ట్ అవుతుంది. సాధారణంగా ఎంత హిట్ వచ్చినా తొలి సినిమాతో ఇలా ఫోకస్ అవ్వడం చిన్న విషయం కాదు. ఆ రకంగా నయనతార లక్కీ గాళ్.
బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా షారుక్ ఏరికోరి మరీ నయన్ దించారు. ఇక్కడే నయనతార సగం సక్సెస్ అయింది. అటుపై విజయంతో పరిపూర్ణం అయింది. అయితే అమ్మడు ఇప్పుడు హిందీలో జర్నీ ఎలా ప్లాన్ చేస్తుంది? అన్నది చూడాలి. అక్కడ స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తే నటిస్తుందా? లేదా? లేక టాలీవుడ్..కోలీవుడ్ మాదిరి సెలక్టివ్ గా వెళ్తుందా? ఇలా ఎన్నో సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
అయితే హిందీ పరిశ్రమలో కాంపిటీషన్ మాత్రం ఈ రెండు పరిశ్రమల్లా ఉండదు. కరీనా కపూర్..కంగనా రనౌత్..కత్రినాకైప్..దీపికా పదుకొణే.. రాణీ ముఖర్జీ..జాక్వెలిన్ పెర్నాండేజ్ లాంటి తలపండిన నాయికలు ఎంతో మంది ఉన్నారు. అలాగే యువ నాయికలు అలియాభట్...జాన్వీ కపూర్ లాంటి ఫేమస్ బ్యూటీలు కొంత మంది ఉన్నారు. వాళ్లందరి పోటీని తట్టుకుని నయన్ నిలబడాల్సి ఉంటుంది.
పైగా బాలీవుడ్ ఇండస్ట్రీ విధి విధానాలు వేరుగా ఉంటాయి. పూర్తిగా దర్శక-నిర్మాతలకు లోబడి పనిచేయా ల్సి ఉంటుంది. దక్షిణాది పరిశ్రమలో అది చేయను..ఇది చేయను అంటే కుదరదు. అక్కడ నుంచి నెగిటివిటీ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ సక్సెస్ అవ్వాలంటే బాండ్ అయి ఉండాల్సిందే. మరి ఇలాంటి సవాళ్ల నడుమ నయన్ జర్నీ ఎలా సాగిస్తుందన్నది ఆసక్తికరం.