Begin typing your search above and press return to search.

యూట్యూబర్ డైరెక్షన్ లో నయన్.. అంతా రెడీ!

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 July 2024 12:30 AM GMT
యూట్యూబర్ డైరెక్షన్ లో నయన్.. అంతా రెడీ!
X

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ లో కూడా ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీతో బీటౌన్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయన్.. ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే హిందీలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ అండ్ చర్చల దశలో ఉన్నవి కలిపి ఆమె చేతిలో మొత్తం 10 చిత్రాలు ఉన్నాయట.

అయితే బ్లాక్ బస్టర్ హిట్ జవాన్, అన్నపూర్ణి సినిమాల తర్వాత నయన్ చేసిన మూవీలు ఏవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులు.. నయన్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నయనతార నటిస్తున్న మన్నన్‌ గట్టి 1960 మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ఇటీవల షూటింగ్ పూర్తి అయినట్లు మేకర్స్.. అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో డ్యూడ్ విక్కీ డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. ఇప్పటికే కల్లూరి సలాయ్‌, తిరువల్లూవర్‌ సర్వీసెస్‌ వంటి పలు వెబ్‌ సిరీసులను తెరకెక్కించి యూట్యూబ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డ్యూడ్ విక్కీ. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో తొలి సినిమా రానుండడంతో అందరి దృష్టి మన్నన్‌ గట్టి 1960 మూవీపై నెలకొంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో యోగిబాబు, నరేంద్ర ప్రశాంత్‌, గౌరీ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమాలు తీయాలనే మక్కువతో యూట్యూబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు డ్యూడ్ విక్కీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడి సృష్టించాలని డ్యూడ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన డెబ్యూ మూవీలో నయన్ నటిస్తుండడంతో.. మరింత ఆసక్తి నెలకొంది. మన్నన్‌ గట్టి 1960 సినిమా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం. దీంతో మూవీ మంచి హిట్ కావడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తానెంటో నిరూపించుకున్న నయన్‌.. త్వరలో కొత్త కథతో తెరకెక్కుతున్న మన్నన్‌ గట్టి 1960 మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. 1960 బ్యాక్‌ డ్రాప్‌ నేపథ్యంలో మునుపెన్నడూ చూడని స్టోరీని ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే తెలిపింది చిత్రబృందం. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.