Begin typing your search above and press return to search.

రేసులో దిగిన నయన్ గాడ్.. భయపెట్టిస్తుందా..?

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఇరైవన్ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. జయం రవి. రాహుల్ బోస్ కూడా ఈ సినిమాలో నటించారు

By:  Tupaki Desk   |   25 Sep 2023 10:21 AM GMT
రేసులో దిగిన నయన్ గాడ్.. భయపెట్టిస్తుందా..?
X

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఇరైవన్ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. జయం రవి. రాహుల్ బోస్ కూడా ఈ సినిమాలో నటించారు. అహ్మద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముందు కేవలం తమిళ్ లో రిలీజ్ చేయాలని అనుకోగా చివరి నిమిషంలో తెలుగు వెర్షన్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28న తమిళంలో ఇరైవన్ తెలుగులో గాడ్ టైటిల్ తో సినిమా రిలీజ్ అవుతుంది.


ఎలాగు రిలీజ్ చేస్తున్నాం కదా అని తెలుగు మార్కెట్ ని ఎందుకు వదులుకోవాలన్న ఆలోచనతో లాస్ట్ మినిట్ లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగు నయనతార కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. టీజర్, ట్రైలర్ కాస్త ఇంట్రెస్ట్ గా అనిపిస్తే చాలు సినిమా చూసేందుకు ఆడియన్స్ వచ్చేస్తారు. ఆ నమ్మకంతోనే గాడ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికెట్ అందుకుంది. సినిమా చాలా వయోలెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నారు జయం రవి. ఇది కేవలం ఒక వర్గం ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా అని అన్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటే మనుషులను చంపి వాళ్ల శరీర భాగాలు వేరు చేసే ఒక సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారన్న కథతో వస్తుంది. సినిమాలో జయం రవి నయనతార పోలీసులుగా నటించారు. సినిమా కథ మాత్రమే కాదు స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ బాగానే ఉన్నారు. కానీ వారికి సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్, థ్రిల్లర్ కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా ఫీల్ కలిగించాలి అలా చేస్తే ఏ సినిమా అయినా తెలుగులో హిట్ కొట్టేస్తుంది. జయం రవి, నయనతార లాంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న గాడ్ తెలుగులో ఓపెనింగ్స్ అంత గొప్పగా తెచ్చుకోకపోవచ్చు కానీ సినిమా బాగా భయపెట్టింది అన్న టాక్ వస్తే మాత్రం ప్రేక్షకులు క్యూ కట్టే ఛాన్స్ ఉంటుంది.