Begin typing your search above and press return to search.

నయన్ ని మనోళ్లు పట్టించుకోవట్లేదు..!

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పరిస్థితి అలానే ఉందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 2:30 AM GMT
నయన్ ని మనోళ్లు పట్టించుకోవట్లేదు..!
X

ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు కెరీర్ గ్రాఫ్ పడిపోక తప్పదు. వారెంత టాలెంటెడ్ అయినా కొత్త హీరోయిన్స్ కి ఛాన్సులు ఇవ్వాలన్న దర్శక నిర్మాతల ఆలోచన స్టార్ హీరోయిన్స్ కి, టాప్ లో ఉన్న భామలకు కొత్త షాక్ ఇస్తుంది. ఐతే అప్పటికి స్టార్ హీరోయిన్స్ కూడా వచ్చిన ప్రతి ఛాన్స్ ని వదలకుండా చేస్తూ మెప్పిస్తుంటారు. కొన్నిసార్లు డేట్స్ అడ్జెస్ట్ అవ్వక కాదనే పరిస్థితి ఉంటుంది. అలా కాదన్న వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలన్నా సరే మేకర్స్ ఆలోచిస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పరిస్థితి అలానే ఉందని తెలుస్తుంది.

కోలీవుడ్ లో తనకు తిరుగు లేదు తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో అమ్మడి పాపులారిటీ ఉంది. అటు కమర్షియల్ సినిమాలైనా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలైనా తన దాకా వచ్చి ఆమె కుదరన్నాకనే వేరే వాళ్లకు వెళ్తుంది. ఇక ఆ టైం లో ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తే నో వే అనేసింది. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. నయనతారని కాదని దర్శక నిర్మాతలు వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్తున్నారు. సరే కోలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి కదా తెలుగు నుంచి ఏదైనా వస్తే చేద్దాం అనుకుంటే ఇక్కడ మేకర్స్ నయనతారని పట్టించుకోవడమే మానేశారు.

ఆమె ఫాం లో ఉన్నప్పుడు తెలుగు నుంచి ఏదైనా ఆఫర్ వస్తే ఏవేవో కారణాలు చెప్పి సినిమా కాదనేదట. దానికి బాగా హర్ట్ అయిన మన వాళ్లు ఇప్పుడు నయనతార తెలుగు సినిమాలు చేస్తానని అంటున్నా ఆమెను కాదని వేరే వాళ్ల కోసం ట్రై చేస్తున్నారట. సినిమా పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు టైం కలిసి వస్తుంది.. ఎవరి కెరీర్ ఎప్పుడు గ్రాఫ్ పడిపోతుంది చెప్పడం కష్టం. అలాంటి టైం లో వచ్చిన ఆఫర్ కాదన్నా అవతల వారిని నొప్పించకూడదు. అలా చేస్తే కెరీర్ లో కాస్త వెనుక పడినప్పుడు కూడా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రారు.

తెలుగులో సీనియర్ హీరోల సరసన నటించిన నయనతార ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన ఛాన్సులకు నో చెప్పడంతో ఆమెను అడగడం కూడా మానేశారు మన దర్శక నిర్మాతలు. అందుకే ఇప్పుడు నయనతార తెలుగులో నటించాలని ఉందని అంటున్నా ఆమెను లైట్ తీసుకుంటున్నారు. ఐతే నయనతార మాత్రమే చేయగలదు అనిపించే సినిమా ఏదైనా వస్తే మాత్రం ఆమెను తీసుకోక తప్పదని చెప్పొచ్చు.