Begin typing your search above and press return to search.

నయనతార ఎదురుచూపులు ఫలిస్తాయా..?

నయనతార కూడా కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న టైం లో టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనేసింది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 1:30 AM GMT
నయనతార ఎదురుచూపులు ఫలిస్తాయా..?
X

కోలీవుడ్ స్టార్ హీరోలకు కూడా చుక్కలు చూపించి అక్కడ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నయనతార ఈమధ్య ఎందుకో కెరీర్ పరంగా కాస్త వెనకపడినట్టు అనిపిస్తుంది. తనకు పోటీగా ఎంతమంది వచ్చినా మొదటి స్థానం తనది మిగతా వారంతా సెకండ్ ప్లేస్ నుంచే లెక్క అనేలా చేసుకున్న నయనతార పెళ్లి ముందు వరకు తన దూకుడు చూపించగా ఆఫ్టర్ మ్యారేజ్ చూస్తుండగానే కాస్త వెనకపడింది. ఐతే ఫాం లో ఉన్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశం చేయడం కుదరదు. ఈ టైం లో కొన్ని మంచి ఆఫర్లను కూడా కాదనాల్సి వస్తుంది.

నయనతార కూడా కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న టైం లో టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనేసింది. స్టార్ సినిమా సూపర్ హిట్ స్టోరీ అయినా కూడా ఆమెకు తెలుగులో చేయడానికి ఆసక్తి ఉండేది కాదు. మరీ బలవంతం చేసి రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానంటే మాత్రం స్టార్ సినిమాలు చేస్తూ వచ్చింది. ఐతే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కోలీవుడ్ లో నయనతార ప్లేస్ చిన్నగా మారిపోతుంది.

నిన్న మొన్నటిదాకా ఆమే నెంబర్ 1 గా ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్ లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు పోటీ పడుతున్నారు. నయనతారని కాదని కొన్ని ఆఫర్లు వేరే హీరోయిన్స్ దాకా వెళ్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైం లో తనని కావాలనుకున్న వారితో కలిసి పనిచేయాలని అనుకుంటుంది నయనతార. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

టాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే చాలనుకుంటుంది నయన్. ఇప్పుడు మన సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న సందర్భంగా తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న టైం లో తెలుగు అవకాశాలను కాదనేసిన నయనతార ఇప్పుడు అదే అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. జవాన్ తో బాలీవుడ్ లో కూడా సక్సెస్ అందుకున్న నయనతార బాలీవుడ్ ఆఫర్ల కన్నా తెలుగు మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి నయనతార ఆశ పడుతున్నట్టుగా టాలీవుడ్ నుంచి ఏదైనా ఆఫర్ వస్తుందేమో చూడాలి. నయనతార ఇప్పుడు ఓకే అంటున్నా అంతకుముందు ఆమెను అడిగి లేదనిపించుకున్న దర్శక నిర్మాతలు మాత్రం అమ్మడికి అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్నట్టు తెలుస్తుంది.