Begin typing your search above and press return to search.

న‌య‌న్.. మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీట్..

కొత్త ఇన్నింగ్స్ ఆరంభంలోనే అదిరిపోయే గ్లామ‌ర‌స్ ట్రీట్ తో న‌య‌న్ పిచ్చెక్కించింది.

By:  Tupaki Desk   |   11 July 2024 4:04 PM GMT
న‌య‌న్.. మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీట్..
X

మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీట్ ఎలా ఇవ్వాలో లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌కు తెలిసినంత‌గా ఇత‌రుల‌కు తెలీదేమో! శ్రీ‌రామ‌రాజ్యం త‌న న‌ట‌నా కెరీర్ లో చివ‌రి చిత్రం అని భావించిన న‌య‌న్ కు ప్ర‌భుదేవా ఊహించ‌ని ట్విస్ట్ ఇవ్వ‌డంతో తిరిగి గ్లామ‌ర‌స్ న‌టిగా రీఎంట్రీ ఇవ్వాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో అజిత్ తో క‌లిసి ఆరంభం చిత్రంలో న‌య‌న్ న‌టించింది. కొత్త ఇన్నింగ్స్ ఆరంభంలోనే అదిరిపోయే గ్లామ‌ర‌స్ ట్రీట్ తో న‌య‌న్ పిచ్చెక్కించింది.


ఇదిగో ఇప్పుడు మ‌ళ్లీ ఆ రేంజులోనే చెల‌రేగిపోయింది ఈ ఫోటోషూట్ కోసం. తాజాగా నయనతార బ్లాక్ అండ్ వైట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఫోటోషూట్ ఇది. తాజా ఫోటోలలో నయ‌న్ టూ హాట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ లుక్ లో న‌య‌న్ ఒంపుసొంపులు మ‌త్తెక్కిస్తున్నాయి. తాజా ఫోటోషూట్ కి స్నేహితులు , అభిమానుల నుండి అద్భుత‌ స్పందన వచ్చింది. నటి నజ్రియా నజీమ్ , కాస్ట్యూమ్ డిజైనర్ అను వర్ధన్ న‌య‌న్ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.


జూలై 10న నయనతార ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను బ్లాక్ హార్ట్ ఎమోజితో షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అవినాష్ గోవారికర్‌ను 'ది స్వీటెస్ట్' అని పిలుస్తూ ప్రేమ‌ను కురిపించింది. నజ్రియా నజీమ్ హార్ట్-ఐ ఎమోజీలను షేర్ చేయ‌గా, అను వర్ధన్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేసారు. నయనతార - విఘ్నేష్ శివన్ వ్యక్తిగత, వృత్తిగ‌త‌ జీవితాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ జంట రెగ్యుల‌ర్ గా తమ కవల కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఇన్‌స్టాలో సంద‌డి చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.


హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూర్ణి'లో నయ‌న్ చివ‌రిగా క‌నిపించారు. 2024లో ఇంకా త‌న నుంచి ఎలాంటి విడుదల కాలేదు. పరీక్ష , 1960 మన్నంగట్టి అనే రెండు తమిళ చిత్రాల షూటింగ్‌ను న‌య‌న్ ముగించింది. అలాగే నివిన్ పౌలీ చిత్రం 'డియర్ స్టూడెంట్స్' మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసింది. త‌దుప‌రి తని ఒరువన్ 2లో న‌టించాల్సి ఉంది.