Begin typing your search above and press return to search.

నయన్ డిమాండ్ మాత్రం తగ్గదంతే..?

లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో ఏ హీరోయిన్ సంపాదించలేని క్రేజ్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   23 July 2024 12:30 PM GMT
నయన్ డిమాండ్ మాత్రం తగ్గదంతే..?
X

లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో ఏ హీరోయిన్ సంపాదించలేని క్రేజ్ తెచ్చుకుంది. సోలో సినిమాలతో స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చిన అమ్మడు అప్పటికీ ఇప్పటికీ అదే రేంజ్ లో అదరగొట్టేస్తుంది. పెళ్లి తర్వాత కాస్త దూకుడు తగ్గినట్టు అనిపించిన నయన్ మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేలా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో ఆమె చేసిన జవాన్ సినిమా సక్సెస్ అవ్వడంతో అక్కడ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఐతే బాలీవుడ్ కన్నా సౌత్ సినిమాలే ముఖ్యంగా తమిళ సినిమాలే బెటర్ అని భావిస్తుంది నయనతార.


ఈమధ్య ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ నుంచి భారీ ఆఫర్ రాగా ఆ ఛాన్స్ వదులుకుందట నయనతార. కారణాలు ఏంటన్నది తెలియదు కానీ ఆ హిందీ సినిమాలో తనకు నటించే ఆసక్తి లేదని చెప్పేసిందట. ఐతే నయన్ కోసం వారు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారని టాక్. ఐతే నయనతార సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది కానీ కేవలం రెమ్యునరేషన్ కోసం ఏ సినిమా చేయదు.

అందుకే ఆ ఆఫర్ ని సున్నితంగానే తిరస్కరించిందట అమ్మడు. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ రెండు సినిమాలు చేస్తున్న నయనతార మరో రెండు కథలను చర్చల్లో ఉంచింది. ఈమధ్య తమిళ్ లో కూడా తన దూకుడు తగ్గిందని వార్తలు వచ్చినా ఇలాంటి టైం లోనే అమ్మడు మరింత పనిచేయాలని అనుకుంటుంది. టాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా వాటిని సరిగా పట్టించుకోని నయనతార ఇప్పుడు తెలుగు ఆఫర్ వచ్చినా చేసేందుకు రెడీ అని అంటుంది.

భర్త విఘ్నేష్.. ఇద్దరు పిల్లలతో ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్న నయనతార కెరీర్ లో కాస్త స్పీడ్ పెంచాల్సినే అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. నయన్ చేస్తున్న సినిమాలు అవి తెస్తున్న ఫలితాలు ఆమె ఫ్యాన్స్ కి సంతృప్తికరంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించే నయనతార అటు కమర్షియల్ సినిమాల్లోనూ ఛాన్స్ వస్తే చేస్తానని చెబుతుంది. పాన్ ఇండియా సినిమాల హంగామా నడుస్తున్న ఈ టైం లో ఇటు తెలుగులో కానీ అటు తమిళ్ లో కానీ ఎలాంటి సినిమా వచ్చినా నేషనల్ లెవెల్ క్రేజ్ ఉన్న నయనతార బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అయితే కథల విషయంలో ఆమె చాలా శ్రద్ధగా ఉంటుంది కాబట్టి తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా ఓకే చెప్పే ఛాన్స్ లేదని తెలుస్తుంది.