Begin typing your search above and press return to search.

లేడీ సూప‌ర్ స్టార్ ప్ర‌యోగాల్లో త‌గ్గేదేలే!

అయితే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పై ఉన్న మ‌క్కువ‌తో అమ్మ‌డు కథ న‌చ్చిందంటే? వెనకా ముందు ఆలోచించ‌కుండా క‌మిట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   21 July 2024 11:30 PM GMT
లేడీ సూప‌ర్ స్టార్ ప్ర‌యోగాల్లో త‌గ్గేదేలే!
X

భారీ స్టార్ డ‌మ్ ఉన్న‌వారంతా కొత్త వాళ్ల‌తో ప్ర‌యోగాలు చేయాలంటే చాలా విష‌యాలు ఆలోచిస్తారు. అత‌డి సామ‌ర్ధ్యం ఎంత‌? న‌మ్మి అవ‌కాశం ఇస్తే చేయ‌గ‌ల‌డా? లేదా? అంచ‌నాలు అందుకోక‌పోయినా నాట్ సో బ్యాడ్ అయినా అనిపించ‌గ‌ల‌డా? అని ఇలా వంద ర‌కాలుగా ఆలోచిస్తారు. స్టార్ డ‌మ్ తో పాటు నిర్మాత కోట్ల రూపాల వ్య‌యం ముడి ప‌డి ఉంటుంది కాబ‌ట్టి ఇవ‌న్నీ ఆలోచించ‌డం స‌హ‌జం. కొన్నిసార్లు ఆప్ర‌యోగాలు స‌క్సెస్ అవుతుంటాయి.

మ‌రికొన్నిసార్లు ఫెయిల‌వుతుంటాయి. ఎవ‌రైనా న‌మ్మే సినిమాలు చేస్తారు. కానీ అన్నిసార్లు అంచ‌నాలు అందుకోవ‌డం క‌ష్టం. ఈ విష‌యంలో మాత్రం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ని మెచ్చుకోవాల్సిందే. మార్కెట్ లో న‌య‌న్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ లోనే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా కొనసాగుతుంది. క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌కు అత్య‌ధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ కూడా ఆమెనే. `జ‌వాన్` విజ‌యంతో పాన్ ఇండియాలోనూ ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.

హిందీ, తెలుగులో అవకాశాలు వ‌స్తున్నా? క‌మిట్ అవ్వని భామ కూడా. అయితే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పై ఉన్న మ‌క్కువ‌తో అమ్మ‌డు కథ న‌చ్చిందంటే? వెనకా ముందు ఆలోచించ‌కుండా క‌మిట్ అవుతుంది. వాళ్లు కొత్త ద‌ర్శ‌కులా? క‌దా? ప‌నిచేసిన అనుభ‌వం ఉందా? లేదా? అనే విష‌యాలు ప‌క్క‌న‌బెట్టి క‌థ న‌చ్చిందంటే ఒకే చెబుతుంది. ఈ మ‌ధ్య కాలంలో మూడు సినిమాలు అదే కోవ‌లో క‌మిట్ అయింది.

ఇలా కొత్త వాళ్ల‌ని ప్రోత్స‌హించ‌డం త‌ప్పు లేదు. నిజంగా ట్యాలెంట్ ఉంటే స‌క్సెస్ కొట్టి చూపిస్తారు. న‌య‌న్ పెట్టుకున్న న‌మ్మ‌కం నిజ‌మ‌వుతంది. కానీ తేడా కొడితే అంతే విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్త‌వానికి న‌య‌న‌తార‌లే ఉమెన్ సెంట్రిక్ చిత్రాల ప్ర‌యోగం చాలా కాలంగా చేస్తోంది. కానీ ఇంత వ‌ర‌కూ సాలిడ్ స‌క్సెస్ ఒక్క‌టీ లేదు. బాక్సాపీస్ వ‌ద్ద 100 కోట్ల హీరోయిన్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్న కోణంలో చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ఆ ప్ర‌యత్న‌మే ఫ‌లించ‌డం లేదు. మ‌రి న్యూ మేక‌ర్స్ ఆమ్మ‌డి డ్రీమ్ ని నెర‌వేరుస్తారేమో చూడాలి.