లేడీ బాస్ కొత్త ఆఫీస్ చూసారా?
బ్యూటీ బ్రాండ్ 9 స్కిన్ -ది లిప్ బామ్ అనే కంపెనీ ని కూడా ఎంతో ఇష్టపడి ప్రారంభించింది.
By: Tupaki Desk | 8 April 2024 12:58 PM GMTలేడీసూపర్ స్టార్ నయనతార వివాహం తర్వాత బిజినెస్ పై రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వివిధ రకాల బిజినెస్ లతో మార్కెట్ లో ఎంటర్ ప్రెన్యూనర్ గానూ సత్తా చాటుతుంది. భర్తతో కలి రౌడీపిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మిస్తుంది. ఇందులో పరిమిత బడ్జెట్ లో కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మిస్తు ఆదాయం అర్జిస్తుంది. బ్యూటీ బ్రాండ్ 9 స్కిన్ -ది లిప్ బామ్ అనే కంపెనీ ని కూడా ఎంతో ఇష్టపడి ప్రారంభించింది. అందులోనూ అమ్మడు సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది.
ఈ బిజినెస్ కి సంబంధించి ఐడియా నుంచి పెట్టుబడి వరకూ అంతా తన సొంత డబ్బుతోనే సమకూర్చింది. హీరోయిన్ గా తనుకున్న ఇమేజ్ ని తెలివిగా బిజినెస్ చేసి ఎన్ క్యాష్ చేసుకుంటుంది. సాధారణంగా బ్యూటీ ప్రోడక్ట్ లను నయన్ పెద్దగా ప్రమోట్ చేయదు. కానీ తన బ్రాండ్ బ్యూటీని మాత్రం మార్కెట్ లో కి ఎంతో తెలివిగా తీసుకెళ్లి సక్సెస్ అయింది. అలాగే శానిటరీ ప్యాడ్ కంపెనీ కూడా స్థాపించింది. తక్కువ పెట్టుబడిలోనే అధిక లాభాలు అర్జించేలా నయన్ ఐడియాలు ఉంటాయని మరోసారి ప్రూవ్ చేసుకుంది.
మరి ఇన్ని బిజనెస్ లున్న అమ్మడికి ఓ కార్పోరేట్ ఆఫీస్ లేకపోతే ఎలా? అందుకే స్వయంగా కొత్త ఆఫీస్ ని నిర్మిస్తుంది. నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని సందర్శించిన కొన్ని ఫోటోలిప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఆపీస్ ని నయన్ ఎంతో ఇష్టపడి నిర్మిస్తున్నట్లు కనిపిస్తుంది. అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకుంటుంది. తన ఆఫీసు ఫోటోలను పంచుకున్న నయనతార మొదటి ఫోటోలో నయనతార తన స్నేహితుడితో కలిసి ఒక గది ముందు నిల్చుంది.
బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో తెల్లటి కుర్తా మరియు ప్యాంటు ధరించింది. ఔట్‌డోర్‌లో క్లిక్ చేసిన ఫోటోలో నయన్ దగ్గరుండి మరీ పనులును పర్యవేక్షించడం చూడొచ్చు. ఇక లాస్ట్ పిక్ లో బిల్డింగ్ ఓవర్ వ్యూలో చూడొచ్చు. హౌస్ కంట్ ఆఫీస్ మల్టీపర్సస్ లో ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. తన ఆఫీస్ ను చూసుకుని నయనతార మురిసిపోతుంది. `మా డ్రీమ్ ఆఫీస్ ను రూపొందించడం. ఈ జర్నీ ఎంతో సంతోషంగా ఉంది`. 30 రోజుల్లోనే నిర్మాణం పూర్తయింది. ఇది నిజంగా మరచిపోలేనిది` అని రాసుకొచ్చారు.
నయనతార ఆఫీస్ ను చూసి అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. మీ క్రియేటివిటీతో నిర్మించిన ఆఫీస్ ఎంతో అందంగా ఉంది..మీ వ్యాపారం అంతే బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక నయనతార స్టార్ గా ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. వస్తోన్న కొత్త అవకాశాలు సైతం వదులుకునేంత బిజీగా ఉంది.