Begin typing your search above and press return to search.

ఆ హీరోకి న‌య‌న‌తార నో చెప్పిందా?

స‌ల్మాన్ స‌ర‌స‌న న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌ని ముర‌గ‌దాస్ ముందుగే ఈ స్టోరీ ఆమెకే చెప్పారుట‌.

By:  Tupaki Desk   |   11 May 2024 1:30 AM GMT
ఆ హీరోకి న‌య‌న‌తార నో చెప్పిందా?
X

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'సికంద‌ర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చాలా గ్యాప్ త‌ర్వాత ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోతున్న చిత్ర‌మిది. తొలిసారి స‌ల్మాన్ చిత్రానికి స్టోరీ అందిస్తే ఈసారి ఏకంగా మెగా ఫోన్ ప‌ట్టేసాడు. దీంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి. ముర‌గ‌దా్ కూడా చాలా గ్యాప్ తీసుకుని ఈ క‌థ రాసాడు. అత‌డి క‌థ‌లు ఎంత యూనిక్ గా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

దీంతో సికంద‌ర్ పాన్ ఇండియాలో మంచి విజ‌యం సాధిస్తుంది? అన్న అంచ‌నాలు క్రియేట్ అవుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్న పైన‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. 28 ఏళ్ల హీరోయిన్ 58 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయ‌డం ఇదే మొదటిసారి. ఇంత‌వ‌ర‌కూ అమ్మ‌డు యంగ్ హీరోల‌తోనే క‌లిసి న‌టించింది. తొలిసారి సీనియ‌ర్ స్టార్ తో న‌టించ‌బోతుంది. మ‌రి ఈ ఫెయిర్ తెర‌పై ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.

అయితే వాస్త‌వానికి ఈ చిత్రంలో న‌టించాల్సింది ర‌ష్మిక కాద‌ని..న‌య‌న‌తార అన్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌ని ముర‌గ‌దాస్ ముందుగే ఈ స్టోరీ ఆమెకే చెప్పారుట‌.

కానీ ఆమె ఎందుక‌నో నిరాక‌రించిందిట‌. స్టోరీ న‌చ్చ‌క‌నా....పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో రిజెక్ట్ చేసిందా? అన్న‌ది తెలియ‌దు గానీ ముర‌గ‌దాస్ మాత్రం చాలా క‌న్విన్స్ చేసాడుట‌. కానీ న‌య‌న్ స‌సేమేరా అన‌డంతో ఆ స్థానంలో ర‌ష్మిక‌ని ఒప్పించిన‌ట్లు వినిపిస్తుంది.

స్టోరీ న‌చ్చ‌క‌పోతే ఎంత పెద్ద స్టార్ అయినా..ఎన్ని కోట్లు ఆప‌ర్ చేసినా న‌య‌న‌తార నిర్మొహ‌మాటంగా నో అనేస్తుంది. గ‌తంలో న‌య‌న్ రిజెక్ట్ చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. 'సికంద‌ర్' కూడా అలా మిస్ చేసుకున్న అవ‌కాశంగా కొంద‌రు భావిస్తున్నారు. స్టోరీ ,పాత్ర న‌చ్చితే సీనియ‌ర్ హీరో అయినా ఎస్ చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కొంత మంది సీనియ‌ర్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సీనియ‌ర్స్ లో స‌ల్మాన్ కి మాత్రం న‌య‌న్ చోటు ఇవ్వలేదు.