నయనతార సీఏ అవ్వాలనుకుందా?
దీన్నీ జీవిత లక్ష్యంగానే భావించిందిట. నటికాకపోతే కచ్చితంగా సంతకాలు పెట్టే సీఏ అయ్యేదాన్ని అని తెలిపింది.
By: Tupaki Desk | 29 July 2024 12:30 AM GMTహీరోయిన్లు అంతా డాక్టర్ కాబోయ యాక్టర్ అయ్యాం అంటారు. మరి అలాంటి లాజిక్ ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉందా? అంటే కాస్త అటు ఇటుగా ఉందనే తెలుస్తోంది. అమ్మడు చార్టెడ్ అకౌంట్ (సీఏ) అవ్వాల నుకుందిట. కానీ అంతకు మించి నటి అవ్వాలనే ఆశతో సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపింది. నయనతారది కేరళ అన్న సంగతి తెలిసిందే. అమ్మడు మధ్యతరగతి కుటుంబానికి చెందినది. బీకాం చదివిన అనంతరం సీఏ చేరాలనుకుందిట.
దీన్నీ జీవిత లక్ష్యంగానే భావించిందిట. నటికాకపోతే కచ్చితంగా సంతకాలు పెట్టే సీఏ అయ్యేదాన్ని అని తెలిపింది. ఆమెకి తెలిసిన దూరపు బంధువు ఒకరు సినిమాల్లో ఉండటంతో ఆయన త్వారా ఫోటోలు పంపిచిందిట. అవి కొందరు దర్శక, నిర్మాతలకు చేరాయి. కానీ ఛాన్సు రాలేదు. దీంతో మలయాళం ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభిం చిందిట. అక్కడ నుంచి నటిగా ప్రమోట్ అయినట్లు గుర్తు చేసుకుంది. అమ్మడు 2005 లో తమిళ్ లో `అయ్యా` అనే చిత్రంలో నటించింది.
అందులో శరత్ కుమార్ కి జంటగా నటించింది. రెండవ సినిమా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కి జోడీగా `చంద్రముఖి`లో నటించింది. అక్కడ నుంచి నయనతార ఏరేంజ్ కి చేరుకుందో తెలిసిందే. సౌత్ లో నెంబవర్ వన్ స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంత మంది అందగత్తెలు వచ్చినా తనకి పోటీ లేదని ఎన్నో సంద ర్భాల్లో నిరూపించింది. స్టిల్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఏకైక సౌత్ హీరోయిన్ నయన్ .
ప్రస్తుతం లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది. వరుసగా ఆ తరహా సినిమాలకే ఎక్కువగా కమిట్ అవుతుంది. ఇప్పటికే రెండు..మూడు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లడానికిరెడీ అవుతోంది. అలాగే `జవాన్` సినిమాతో బాలీవుడ్ కి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గానయనతార కావాలని మరీ షారుక్ ఎంపిక చేసాడు. ప్రస్తుతం అక్కడా మంచి అవకాశాలు వస్తున్నాయి.