Begin typing your search above and press return to search.

తెలివితక్కువ వారితో వాదించొద్దని చెప్తున్న స్టార్ హీరోయిన్!

''తెలివి తక్కువ వారితో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని వారి స్థాయికి క్రిందికి లాగి, ఆపై వారి అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు'' అని అమెరికన్‌ రైటర్‌ మార్క్ ట్వైన్ కొటేషన్ ను నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   29 July 2024 3:24 PM GMT
తెలివితక్కువ వారితో వాదించొద్దని చెప్తున్న స్టార్ హీరోయిన్!
X

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కాస్త ఆలస్యంగా సోషల్‌ మీడియాలో అడుగుపెట్టినప్పటికీ.. ఇన్‌స్టాగ్రామ్ లో ఏడాది కాలంలోనే 8.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇన్‌స్టా వేదికగా తన సినిమా సంగతులు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా పోస్టులు పెడుతున్న నయన్.. మందార పువ్వుతో చేసిన టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ రీసెంట్ గా ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై విమర్శలు రావడంతో దాన్ని డిలీట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ కొటేషన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

''తెలివి తక్కువ వారితో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని వారి స్థాయికి క్రిందికి లాగి, ఆపై వారి అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు'' అని అమెరికన్‌ రైటర్‌ మార్క్ ట్వైన్ కొటేషన్ ను నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల తనను విమర్శించిన వారిని ఉద్దేశించే నటి ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మందార పువ్వులతో చేసే టీ అంటే తనకెంతో ఇష్టమని, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నయనతార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని చెప్పింది. ఈ పోస్ట్ పై ఓ ఆరోగ్య నిపుణుడు స్పందించారు. ది లివర్‌ డాక్టర్‌ అనే ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ పెడుతూ.. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను నయనతార తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె చెప్పిన దాంట్లో నిజం లేదంటూ.. ఆరోగ్య సమస్యల గురించి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చెయ్యొద్దని పేర్కొన్నాడు. ఇది వైరల్ గా మారడంతో నయన్ తన పోస్ట్‌ను తొలగించింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలివితక్కువ వాళ్ళతో వాదించొద్దు అంటూ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే, లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార.. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 80కి పైగా చిత్రాలలో నటించింది. గతేడాది జవాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం దాదాపు పది ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. టెస్ట్, మన్నంగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, తని వరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, మూకుతి అమ్మన్ 2, NT 81, టాక్సిక్ వంటి చిత్రాలలో నటిస్తోంది. మమ్ముట్టి - గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో తెరెక్కుతున్న సినిమాతో పాటుగా మరో తమిళ్ ప్రాజెక్ట్ కమిట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిర్మాతగా తన బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తోంది.