Begin typing your search above and press return to search.

సినిమా షూటింగ్ ల్లో న‌య‌న‌తార‌!

లేడీ సూప‌ర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అవుతోన్న జోరు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 9:30 AM GMT
సినిమా షూటింగ్ ల్లో న‌య‌న‌తార‌!
X

లేడీ సూప‌ర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అవుతోన్న జోరు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆన్ సెట్స్ లో ఉన్న లైనప్ తో సంబంధం లేకుండా అమ్మ‌డు సంత‌కాలు చేస్తోంది. లేడీ ఓరియేంటెడ్ అంటూ వ‌చ్చిన ఏ క‌థ‌ని విడిచి పెట్ట‌డం లేదు. శ్ర‌ద్ద‌గా వింటుంది. న‌చ్చితే ఒకే చెబుతుంది. న‌చ్చ‌క‌పోతే మార్పులు కోరుతుంది. అంతేగానీ ప్రాజెక్ట్ మాత్రం చేజార‌నివ్వ‌డం లేదు.

బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాటాలి...తానో బ్రాండ్ అని ప్రూవ్ చేయాలి అన్న కోణంలో అమ్మ‌డు వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏ క‌థ‌ని వ‌ద‌ల‌డం లేదు. ఇదంతా ఒక వెర్షన్ అయితే ప్ర‌స్తుతం ఆన్ సెట్స్ లో ఎన్ని సినిమాలు న్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆరు కాదు..ఏడు కాదు..ఎనిమిది కాదు..ఏకంగా 11 సినిమా షూటింగ్ ల్లో ఏక‌కాలం పాల్గొంటుంది.

త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌లు క‌లిపితే ఇంత లెక్క తేలింది. టెస్ట్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసింది. `మ‌న్నాగ‌ట్టై సిన్స్ 1960`,` డియ‌ర్ స్టుండెట్స్`, `మ‌మ్ముట్టి జీవీఎమ్ ఫిల్మ్`, `త‌ని ఒరువ‌న్-2`, `ఎన్టీ 81`, `గుడ్ బ్యాడ్ అగ్లీ`, `విష్ణు య‌దువ‌న్ సినిమా`, `టాక్సిక్`, `మోకుత్తై అమ్మాన్ -2`, `స‌ర్జ‌న్ కె.ఎమ్ ఫిల్మ్`, `మ‌హారాణి` చిత్రాలు చేస్తోంది. ఇవ‌న్నీ కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

వాటికి కేటాయించిన కాల్సీట్ల ప్ర‌కారం షూటింగ్ ల‌కు హాజ‌ర‌వుతుంది. `టెస్ట్` ని తీసేస్తే 11 సినిమాలు సెట్స్ లో క‌నిపిస్తున్నాయి. అంటే న‌య‌న‌తార ఎంత క‌మిట్ మెంట్ తో ప‌నిచేస్తుందో ఇక్క‌డే అర్ద‌మ వుతుంది. ఇవిగాక దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని కొత్త క‌థ‌లు విన‌డానికి కేటాయిస్తుంది. అలా లాక్ చేసిన సినిమాలు కూడా మూడు నాలుగు ఉన్నాయి. అవ‌న్నీ కూడా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలే.

తాజాగా `మ‌హారాజా` ద‌ర్శ‌కుడు నిథిల‌న్ స్వామినాథ‌న్ వినిపించిన స్టోరీని సైతం లాక్ చేసింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఇన్ని సినిమాలు చేస్తోన్న ఏకైక హీరోయిన్ న‌య‌న‌తార మాత్ర‌మే. దేశంలో ఇంకే హీరోయిన్ ఇన్ని సినిమాల‌తో ఇంత బిజీగా లేదు.