Begin typing your search above and press return to search.

పారితోషికంలో నంబ‌ర్ -1 సౌత్ హీరోయిన్

తాజా స‌మాచారం మేర‌కు సౌత్ లో 10 కోట్లు పారితోషికం అందుకుంటున్న ఏకైక క‌థానాయిక‌గా న‌య‌న్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 April 2024 5:16 AM GMT
పారితోషికంలో నంబ‌ర్ -1 సౌత్ హీరోయిన్
X

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కేవ‌లం భార‌త‌దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క‌థానాయ‌కుడిగా రికార్డుల‌కెక్కాడు. ఒక సౌత్ న‌టుడికి ఇలాంటి రికార్డు చాలా అరుదు. ర‌జ‌నీ త‌దుప‌రి లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమా కోసం ఏకంగా 250-260 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడ‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఆసియాలోనే పారితోషకంలో నంబ‌ర్ -1 హీరోగా ర‌జ‌నీ పేరు రికార్డుల‌కెక్కింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో పారితోషికం ప‌రంగా సౌత్ నంబ‌ర్ -1 హీరోయిన్ ఎవ‌రు? అన్న చ‌ర్చా తెర‌పైకొచ్చింది. త్రిష‌, కాజ‌ల్, స‌మంత‌, అనుష్క శెట్టి, రష్మిక మంద‌న ఇలా కొన్ని పేర్లను అభిమానులు వైర‌ల్ చేస్తున్నా కానీ, నిజానికి త‌లైవి న‌య‌న‌తార పారితోషికంలో సౌత్ బెస్ట్ హీరోయిన్ గా రికార్డుల‌కెక్కింది. తాజా స‌మాచారం మేర‌కు సౌత్ లో 10 కోట్లు పారితోషికం అందుకుంటున్న ఏకైక క‌థానాయిక‌గా న‌య‌న్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ద‌శాబ్ధాల కెరీర్ లో అజేయ‌మైన ట్రాక్ రికార్డ్ స‌హా అసాధార‌ణ‌ ఛ‌రిష్మా, ప్ర‌తిభ ఆధారంగా న‌య‌న్ కు పెద్ద మొత్తంలో పారితోషికం ముట్ట‌జెప్పేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌డం లేదు.

నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తోను న‌య‌న‌తార స‌త్తా చాటుతోంది. బాలీవుడ్ లో దీపిక త‌ర‌హాలో కోలీవుడ్ లో న‌య‌న్ థియేట‌ర్ల‌లో క్రౌడ్ పుల్ల‌ర్ గా పేరు తెచ్చుకుంది. దీంతో భారీ పారితోషికం ముట్ట‌జెప్పేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌టం లేదు.

ఇటీవ‌లే షారూఖ్ స‌ర‌స‌న జ‌వాన్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించింది. ఈ సినిమాతో న‌య‌న‌తార 1000 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా రికార్డుల‌కెక్కింది. కార‌ణం ఏదైనా కానీ న‌య‌న్ మాత్ర‌మే సౌత్ నుంచి 10 కోట్లు డిమాండ్ చేయ‌గ‌లిగే నటి. ఆ త‌ర్వాత ఇత‌ర క‌థానాయిక‌ల్లో 4-5 కోట్ల మ‌ధ్య అందుకుంటున్న వారు ఉన్నారు. చాలా మంది 2-3 కోట్ల రేంజులోనే ఉన్నారు. త్రిష‌, ర‌ష్మిక లాంటి భామ‌లు 4 కోట్ల రేంజులో ఉన్నార‌ని కూడా టాక్ ఉంది.