Begin typing your search above and press return to search.

యష్ చెల్లిగా పవర్ఫుల్ హీరోయిన్

రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొత్త సినిమా చేస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Jun 2024 5:30 PM GMT
యష్ చెల్లిగా పవర్ఫుల్ హీరోయిన్
X

రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొత్త సినిమా చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. టాక్సిక్ టైటిల్ తో ఈ మూవీని గీతూ మోహన్ దాస్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ బయటకొచ్చింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో యష్ కి సిస్టర్ గా కనిపించబోతోందంట. ఆమె పాత్రకి మూవీలో మంచి ప్రాధాన్యత ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో నడిచే గ్యాంగ్ స్టార్ కథాంశంతో టాక్సిక్ మూవీ ఉండబోతుందంట. ముందుగా ఈ చిత్రంలో సిస్టర్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని సంప్రదించారంట. ఆమె కూడా నటించడానికి ఒకే చెప్పిందంట.

అయితే డేట్స్ క్లాస్ కావడంతో వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో చిత్ర యూనిట్ నయనతారని సంప్రదించారంట. ఆమె కథ విన్న వెంటనే ఒకే చెప్పిందంట. 200 రోజులు ఈ మూవీ షూటింగ్ ప్లాన్ చేసారంట. మెజారిటీ షూటింగ్ అంత లండన్ లో జరగబోతోందని తెలుస్తోంది. యష్ ఈ చిత్రంలో స్టలిష్ డాన్ పాత్రలో కనిపిస్తాడంట. డ్రగ్స్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ కథ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

నయనతార, యష్ కాంబినేషన్ లో మెజారిటీ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. త్వరలో మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయడానికి డైరెక్టర్ గీతూ ప్లాన్ చేస్తున్నారంట. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె కన్నడంలో చేయబోయే మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కేజీఎఫ్ 2తో రాకింగ్ స్టార్ యష్ కి బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ వచ్చింది.

టాక్సిక్ మూవీకి అది హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. మరో వైపు హిందీలో రామాయణం సిరీస్ లో యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా లైన్ అప్ లో ఉంది. అయితే ఆ చిత్రం 2026లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.