Begin typing your search above and press return to search.

"నయనా"నందకరంగా ట్విన్స్ ఫోటోలు... కామెంట్స్ వైరల్!

తాజాగా నయనతార తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే గతంలో తన కవలలతో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్‌ ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   26 Sept 2023 6:19 PM IST
నయనానందకరంగా ట్విన్స్  ఫోటోలు... కామెంట్స్  వైరల్!
X

అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ తాజాగా బాలీవుడ్... ఉడ్ ఏదైనా లేడీ సూపర్ స్టార్ నయనతార రోల్ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం భారీ స్టేటస్ సంపాదించుకున్న నయనతార... కెరీర్ ప్రారంభంలో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసింది. చాలా కష్టపడింది. యాంకరింగ్ కూడా చేసింది!


అలా నాడు తెగ కష్టపడిన ఈ భామ... ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి చేరింది. అలాగే కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ని పెళ్లాడిన ఈ మలయాళీ బ్యూటీ... ఇటీవల కవల పిల్లలకు అమ్మగా మారింది. అయినా కూడా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం "జవాన్" సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.


ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నయనతార.. తాజాగా తన ఇద్దరి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్... తన కవల పిల్లల ఫోటోలను డిఫరెంట్ స్టైల్లో తీసి.. పంచుకుంది.

అవును... తాజాగా నయనతార తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే గతంలో తన కవలలతో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్‌ ను షేర్ చేసింది. ఈ ఫోటో ట్విన్స్ పుట్టినప్పుడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్... కవల పిల్లలిద్దరినీ బ్లెస్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.