నయన్- విఘ్నేష్.. ట్విస్ట్ ఏంటి అంటే?
By: Tupaki Desk | 4 March 2024 4:19 AM GMTనయనతార- విఘ్నేష్ శివన్ జంట సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఇన్ స్టాలో ఆకస్మికంగా నయనతార తన భర్త విఘ్నేష్ ని అన్ ఫాలో చేయడమే గాక విచారంతో ఉన్న క్యాప్షన్ ఇవ్వడంతో దానిపై రకరకాలుగా ప్రచారం సాగింది. ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? నయనతార విచారంగా ఎందుకు ఉంది? అంటూ చర్చించుకున్నారు. భర్త విఘ్నేష్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతోనే ఈ ఊహాగానాలకు తావిచ్చింది.
అయితే ఒకసారి అన్ ఫాలో అయినా కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే నయన్ తిరిగి భర్తను ఫాలో చేయడంతో కొంత కన్ఫ్యూజన్ తొలగిపోయింది. అన్ని ఊహాగానాలకు చెక్ పెడుతూ ఇప్పుడు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నయనతార ఫోటోను షేర్ చేసాడు. ఈ జంట మధ్య అంతా బాగానే ఉందనేందుకు ఇది సూచిక.
అయితే భర్తను నయన్ అన్ ఫాలో చేయడానికి కారణమేమిటి? అంటే.. సోషల్ మీడియాలో ఏదైనా సాంకేతిక లోపం ఉండి ఉండొచ్చు.. లేదా పొరపాటున అలా జరిగి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే నయన్ కానీ, విఘ్నేష్ కానీ దీనిపై పూర్తి స్పష్ఠతను ఇవ్వలేదు. నయనతార- విఘ్నేష్ జంటకు సరోగసీలో జన్మించిన కవలలు ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నయనతార- విఘ్నేష్ ఎవరికి వారు బిజీగా ఉన్నారు. నయన్ తన తదుపరి చిత్రం ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన `టెస్ట్` విడుదల కోసం వేచి చూస్తోంది. ఈ చిత్రంలో ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.