నా విజయం, సంతోషం వెనుక ఆయన పాత్ర...!
తమ వైవాహిక జీవితం అత్యంత అన్యోన్యంగా సాగుతుందని ఆమె తన మాటల ద్వారా చెప్పకనే చెప్పింది.
By: Tupaki Desk | 11 Jan 2024 7:34 AM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార మీడియాలో చాలా రేర్ గా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత తన పద్దతి మరియు రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల ప్రమోషన్ విషయంలో మెల్ల మెల్లగా తన పాత పద్దతులను మార్చుకుంటూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉందని సమాచారం అందుతోంది.
ఇక తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ గురించి ఒక సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ వైవాహిక జీవితం అత్యంత అన్యోన్యంగా సాగుతుందని ఆమె తన మాటల ద్వారా చెప్పకనే చెప్పింది. తమ అందమైన జీవితం కు విఘ్నేష్ శివన్ కారణం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఇంకా నయన్ మాట్లాడుతూ... ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే స్త్రీ విజయం వెనుక కూడా పురుషుడు కచ్చితంగా ఉంటాడు. నా విజయం మరియు సంతోషం వెనుక కచ్చితంగా విఘ్నేష్ ఉంటాడు. నా జీవితంలోకి విఘ్నేష్ వచ్చాక ఆనందం, సంతోషం దక్కాయి అని పేర్కొంది.
సుదీర్ఘ కాలం ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్ మరియు విఘ్నేష్ లు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. నయన్ యొక్క ప్రతి నిర్ణయాన్ని కూడా విఘ్నేష్ గౌరవిస్తూ, ఆమెకు అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహకం గా నిలుస్తున్నాడట. అందుకే ఈ స్థాయిలో తాను విజయాలను సొంతం చేసుకుంటున్నాను అంటూ నయన్ పేర్కొంది.
తాజాగా నయనతార అన్నపూర్ణ అనే సినిమా తో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మరింత ఉత్సాహంతో ప్రస్తుతం టెస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. మాధవన్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో నయన్ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతోంది. మరో వైపు హిందీలో కూడా ఈమెకు చాన్స్ లు వస్తున్నాయట.