Begin typing your search above and press return to search.

న‌య‌న్ త‌ర్వాత మ‌ళ్లీ త్రిష‌కే అంత పెద్ద ప్యాకేజీ?

ఈ చిత్రంలో న‌య‌న‌తార న‌టించినా లేదా త్రిష న‌టించినా కానీ 12 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ డ్ గా ఉంచార‌ని స‌మాచారం. ఒక‌వేళ న‌య‌న్ న‌టించ‌క‌పోయినా త్రిష‌కు 12 కోట్లు అంద‌జేస్తారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:14 AM GMT
న‌య‌న్ త‌ర్వాత మ‌ళ్లీ త్రిష‌కే అంత పెద్ద ప్యాకేజీ?
X

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క‌థానాయిక‌గా న‌య‌న‌తార పేరు వినిపిస్తోంది. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మ‌రో ద‌క్షిణాది నాయిక ఉంద‌నేది మీకు తెలుసా?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇప్పుడు స్ప‌ష్ఠంగా ఉంది. న‌య‌న‌తార 'జ‌వాన్' లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విజ‌యంతో సంబంధం లేకుండానే ఒక్కో సినిమాకి సుమారు 10కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్న క‌థానాయిక‌గా వెలిగిపోతోంది. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న భారీ చిత్రంలో న‌టించేందుకు న‌య‌న‌తార‌కు 12 కోట్లు ఆఫ‌ర్ చేసార‌ని స‌మాచారం.

నిజానికి ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించాల్సి ఉన్నా కానీ, ఇప్పుడు మేక‌ర్స్ చూపు న‌య‌న్ పై ప‌డింద‌ట‌. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో న‌య‌న‌తార న‌టించినా లేదా త్రిష న‌టించినా కానీ 12 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ డ్ గా ఉంచార‌ని స‌మాచారం. ఒక‌వేళ న‌య‌న్ న‌టించ‌క‌పోయినా త్రిష‌కు 12 కోట్లు అంద‌జేస్తారు. నిజంగా ఇది స‌ర్ ప్రైజ్ థింగ్. న‌య‌న‌తార‌కు ధీటుగా స‌త్తా ఉన్న క‌థానాయిక‌గా త్రిష‌కు గుర్తింపు ఉంది. సౌత్ లో అద్భుత‌మైన అభిన‌యంతో హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన‌ న‌టిగా త్రిషకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు జ‌వాన్ త‌ర్వాత న‌య‌న‌తార‌కు పాన్ ఇండియాలో క్రేజ్ పెరిగింది. ఆ ర‌కంగా చూస్తే న‌య‌న్ కి 12 కోట్లు అంత‌కుమించి పారితోషికం ఇచ్చినా అది చెల్లుబాటు అవుతుంది.

అయితే త్రిష ఇప్ప‌టివ‌ర‌కూ ద‌క్షిణాదిన సూప‌ర్ స్టార్. కానీ ఉత్త‌రాది ఆడియెన్ లో అంతగా ప‌రిచ‌యం లేదు. అప్ప‌ట్లో హిందీ చిత్రాల్లో ప్ర‌య‌త్నించినా కానీ త‌న ప్లాన్ ఫ‌లించ‌లేదు. కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు న‌య‌న‌తార‌ను KH 234 లో న‌టింప‌జేసేందుకు మ‌ణిర‌త్నం యోచిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. KH 234 త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. కమల్ హాసన్ తో అవ‌కాశం ద‌క్కించుకుంటే న‌య‌న్ కి ఇదే తొలి ఆఫ‌ర్ అవుతుంది.

ఆస‌క్తిక‌రంగా న‌య‌న‌తార త‌ర్వాత అంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే అవ‌కాశం ద‌క్కించుకున్న న‌టిగా ఇప్పుడు త్రిష పేరు కూడా ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. న‌య‌న‌తార ఇమేజ్ తో పోల్చి చూస్తే, త్రిష రేంజ్ ఏమాత్రం త‌క్కువ కాదు. టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఏలిన మేటి న‌టి. అందుకే ఇప్పుడు త్రిష గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.