Begin typing your search above and press return to search.

పుష్ప 2 : మా ఆయన విశ్వ రూపం చూస్తారు

భారీ బడ్జెట్‌తో రాబోతున్న పుష్ప 2 పూర్తి స్థాయి నటుడిని చూపిస్తుందని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 7:02 AM
పుష్ప 2 : మా ఆయన విశ్వ రూపం చూస్తారు
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ చివర్లో వచ్చాడు. కానీ పుష్ప 2 లో మాత్రం మొదటి నుంచి చివరి వరకు అల్లు అర్జున్ పాత్రకు ధీటుగా ఆయన పాత్ర ఉంటుందట. మొదటి పార్ట్‌లో ఆయన పాత్రను పరిచయం చేయడం జరిగింది. పరిచయంతోనే షాక్ ఇచ్చిన ఫహద్‌ సీక్వెల్‌లో తన పాత్రతో, తన యాక్టింగ్‌తో సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. నటుడిగా ఇప్పటికే చాలా సార్లు తనను తాను నిరూపించుకునే విధంగా నటించిన ఫహద్ ఫాసిల్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉండబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న పుష్ప 2 పూర్తి స్థాయి నటుడిని చూపిస్తుందని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు.


తాజాగా ఫహద్‌ ఫాసిల్‌ భార్య నజ్రిమా నజిమ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప పార్ట్‌ 1 లో ఫహద్‌ ఫాజిల్‌ యొక్క నటన కేవలం ట్రైలర్‌ మాత్రమే. పుష్ప 2 లో ఆయన నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటన షాకింగ్‌గా ఉంటుంది అంటూ ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఫహద్‌ యొక్క కెరీర్‌ బెస్ట్‌ పుష్ప 2 లో ఉండబోతుందని ఆమె చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. భన్వర్ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌గా బన్నీకి సరిపోటీ ఇచ్చే విధంగా నటించాడని యూనిట్‌ సభ్యులు సైతం చెప్పుకొచ్చారు.

భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ గుండు లుక్‌లో పార్టీ లేదా పుష్ప అంటూ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ జనాలు ఇమిటేట్‌ చేస్తూనే ఉన్నారు. కొన్ని నిమిషాలు కనిపించి సంచలనం సృష్టించిన ఫహద్ ఫాజిల్‌ పుష్ప 2 లో సినిమా మొత్తం కనిపించడం ద్వారా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. అత్యంత క్రూరమైన పాత్రలో ఈయన కనిపించబోతున్నాడని ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. పుష్ప, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

సినిమాలో అల్లు అర్జున్ కాకుండా రష్మిక మందన్న, శ్రీలీల, జగపతి బాబు, అనసూయ, సునీల్ ఇంకా ఎంతో మంది ఉన్నా ఎక్కువ శాతం మంది బన్నీ తర్వాత ఫహద్ ఫాజిల్‌ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన ఈ సినిమాకు కచ్చితంగా అదనపు ఆకర్షణ అనడంలో సందేహం లేదు. వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మలయాళంలో ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేసిన ఫహద్ ఫాజిల్‌ ఇక మీదట వరుసగా పాన్‌ ఇండియా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.