Begin typing your search above and press return to search.

ఫాహద్ సీక్రెట్ బయట పెట్టిన హీరోయిన్..!

ఫాహద్ ఫాజిల్ ఒక పాత్ర ఎంపిక చేసుకున్నాడు అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇది చాలాసార్లు ఆయన ప్రూవ్ చేశారు.

By:  Tupaki Desk   |   18 Nov 2024 10:30 PM GMT
ఫాహద్ సీక్రెట్ బయట పెట్టిన హీరోయిన్..!
X

సౌత్ లో ఉన్న విలక్షణ నటుల్లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. మలయాళంలో సోలో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగు, తమిళ భాషల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకుంటున్నారు. తెలుగులో పుష్ప 1 తో ప్రేక్షకులకు దగ్గరైన ఫాహద్ ఫాజిల్ తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత దగ్గరయ్యారు. ఫాహద్ ఫాజిల్ ఒక పాత్ర ఎంపిక చేసుకున్నాడు అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇది చాలాసార్లు ఆయన ప్రూవ్ చేశారు.

కథ, కథనాలు ఎలా ఉన్నా ఫాహద్ పాత్ర వరకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఐతే ఫాహద్ లోని ఒక స్పెషల్ క్వాలిటీని బయట పెట్టింది అతని భార్య సౌత్ స్టార్ హీరోయిన్ నజ్రియా. హీరోయిన్ గా మంచి ఫాం కొనసాగిస్తున్న టైం లోనే ఫాహద్ తో ప్రేమ పుట్టడం ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఐతే ఆఫ్ స్క్రీన్ ఫాహద్ ఎంత బాగా తెలిసినా ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్తే అతను వేరేలా కనిపిస్తాడని చెప్పుకొచ్చింది నజ్రియా.

రీసెంట్ గా నజ్రియా నటించిన సూక్ష దర్శిని ప్రమోషన్స్ లో భర్త ఫాహద్ ఫాజిల్ గురించి చాలా విషయాలను పంచుకుంది. ఫాహద్ ఒక మంచి నటుడని.. ఐతే తామిద్దరం కలిసి బెంగళూరు డేస్ కన్నా ముందు నటించాల్సి ఉన్నా తన ట్వెల్త్ ఎక్సామ్స్ ఉండటం వల్ల ఆ ఛాన్స్ వదులుకున్నానని అన్నది నజ్రియా. బెంగళూరి డేస్ కన్నా ముందు ఫాహద్ నటించిన ఆర్టిస్ట్ సినిమాలో ఛాన్స్ వచ్చినా తాను చేయలేకపోయానని చెప్పుకొచ్చింది నజ్రియా.

ఆ సినిమా తర్వాత బెంగళూరు డేస్ లో మాత్రం తనకు అవకాశం వచ్చిందని.. ఆ సినిమా టైం లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని. అది ప్రేమగా దారి తీసి పెళ్లిదాకా వెళ్లిందని అన్నారు. ఐతే సెట్ లోకి వెళ్లగానే ఫాహద్ పూర్తిగా మారిపోతాడని.. అప్పటివరకు బాగా పరిచయం ఉన్న తను అప్పుడు వేరేలా కనిపిస్తాడని అన్నది నజ్రియా. ఫాహద్ నటించిన జోజీ సినిమాలో చేసిన పాత్ర తనపై ఎంతో ప్రభావం చూపించిందని నజ్రియా చెప్పింది. అంతేకాదు ఫాహద్ చూడటానికి సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తాడు కానీ అతనెంత సరదా మనిషో ఒకసారి మాట్లాడితే తెలుస్తుందని అన్నది నజ్రియా.

ఫాహద్ నజ్రియా మళ్లీ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే కథ దొరికితే తప్పకుండా కలిసి నటించడానికి రెడీ అని నజ్రియా చెబుతుంది.