Begin typing your search above and press return to search.

NBK109: ప్లాన్ సెట్టయ్యింది.. ఇక పండగలో యుద్ధమే..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో తన మార్క్‌ను మరింత పెంచుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 4:53 AM GMT
NBK109: ప్లాన్ సెట్టయ్యింది.. ఇక పండగలో యుద్ధమే..
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో తన మార్క్‌ను మరింత పెంచుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ NBK109 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ గారు సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.


ఇప్పటికే విడుదలైన పోస్టర్స బాలకృష్ణ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తున్న బాబీ, మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోనుంది. బాలయ్య తన మునుపటి చిత్రాలతో పోలిస్తే మరింత పవర్ఫుల్, స్టైలిష్ పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్‌ నుంచి అర్థమవుతోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డీయోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి స్టార్ల కలయిక సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ఇక చిత్ర యూనిట్ ఈ సినిమాను దసరా సందర్భంగా స్పెషల్ అప్డేట్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దీంతో NBK109 పై భారీ క్రేజ్ నెలకొంది. ఫైనల్ గా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

NBK109 సినిమా సంక్రాంతి 2025 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కానుంది. అలాగే దీపావళి సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ ఎస్ అందిస్తున్నారు.

థమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే విజయం కార్తిక్ కనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. విజయం కార్తిక్ ఛాయాగ్రహణం సినిమాకి రిచ్ లుక్ తీసుకురానుందట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయనుంది.

ఇక ఈ సంక్రాంతి సీజన్‌లో NBK109 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్దమవుతోంది. సంక్రాంతి రేసులో ఇప్పటికే రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు బరిలో ఉన్నాయి. అలాగే మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో NBK109 కూడా అదే సమయంలో విడుదల అవుతుండటంతో ఈ సంక్రాంతి సీజన్ మరింత ఆసక్తికరంగా మారనుంది.