Begin typing your search above and press return to search.

NBK 109: ఈ సస్పెన్స్ వీడేది ఎప్పుడంటే..

ఇక ఈ సినిమా షూటింగ్ పరంగా శరవేగంగా వెళుతున్నప్పటికి అసలు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 4:30 PM GMT
NBK 109: ఈ సస్పెన్స్ వీడేది ఎప్పుడంటే..
X

నందమూరి బాలకృష్ణ 109వ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఎందుకంటే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య తో సాలీడ్ హిట్ కొట్టిన యువ దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పరంగా శరవేగంగా వెళుతున్నప్పటికి అసలు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

ముఖ్యంగా, సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా వెల్లడించకపోవడం వల్ల సస్పెన్స్ కొనసాగుతుండగా, అప్డేట్స్ విషయంలో కూడా కొంత నిరాశ ఉంటోందని చెప్పాలి. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ పెద్దగా హైలెట్ అవ్వలేదు. ఫస్ట్ లుక్, పోస్టర్ వంటి ప్రాథమిక వివరాలు కూడా రాకపోవడంతో అభిమానులు చాలా కాలంగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల టైటిల్ రివీల్ చేయాలని ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదట. ఇక ఫైనల్ గా దసరా కానుకగా సినిమా టైటిల్‌ను ప్రకటించవచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ పై మరింత సస్పెన్స్ కొనసాగుతోంది. బాలయ్య సినిమా కావడంతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా, టైటిల్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రకటించాలని మేకర్స్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

అభిమానులు ఇకపై టైటిల్‌తో పాటు, ఇతర అప్డేట్స్ గురించి క్లారిటీ రావాలని ఆశపడుతున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. థమన్‌తో బాలయ్య గతంలో చేసిన సినిమాలు మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ గా నిలవడంతో, ఈసారి కూడా అభిమానుల్లో పాజిటివ్ వెయిటింగ్ ఉంది. కేవలం మాస్ ఆడియెన్స్ ను మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ మరియు త్రివిక్రమ్ కలిసి నిర్మిస్తున్నారు.

‘అఖండ’, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం, ఆ స్థాయికి తగ్గట్టే NBK109 సినిమా ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. మాస్ కథాంశాలతో పాటు, ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దర్శకుడు బాబీ కొల్లి కూడా ఈ సినిమాతో తన మార్క్‌ను చూపించే దిశగా కృషి చేస్తున్నారని తెలుస్తోంది.