NBK 109 : సంక్రాంతికి కన్ఫర్మ్, డేట్ డౌట్!
బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల దసరాకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది.
By: Tupaki Desk | 24 Sep 2024 8:43 AM GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న NBK109 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ, వీర సింహరెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య మరో సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అయింది. బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల దసరాకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది.
గతంలో పలు సార్లు బాలయ్య సంక్రాంతికి వచ్చి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి బాలయ్య, బాబీతో చేస్తున్న సినిమాతో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంక్రాంతికి వస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం సైతం ఉంది. అందుకే NBK 109 చిత్రంను 2025 సంక్రాంతికి విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అయితే విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. చిత్ర యూనిట్ సభ్యుల వద్ద రెండు డేట్లు ఉన్నాయట. ఆ రెండు డేట్లలో ఏ తేదీన సినిమాను విడుదల చేయాలని అంతా భావిస్తున్నారు.
బాలయ్య 109 సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని కొందరు భావిస్తూ ఉంటే, టీం లోని కొందరు మాత్రం సంక్రాంతికి ఇంకాస్త ముందు అంటే జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల విషయమై చర్చ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమాతో సాధిస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. పైగా దర్శకుడు బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
బాలకృష్ణ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఈ సినిమాలో దర్శకుడు బాబీ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు టైటిల్ ను ప్రకటించకపోవడంతో పాటు, కనీసం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ ను విడుదల చేయక పోవడంతో ఫ్యాన్స్ లో ఆతృత మరింత పెరుగుతూనే ఉంది. ఈ దసరాకి సినిమా టైటిల్ ను ప్రకటించడంతో పాటు, కచ్చితంగా టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక వేళ సినిమా అప్డేట్ ను దసరాకి ఇవ్వకుంటే ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో బాబీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దసరాకు సినిమా విడుదల తేదీ విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.