Begin typing your search above and press return to search.

NBK109.. మరోసారి అదే సెంటిమెంట్

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ NBK109. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు

By:  Tupaki Desk   |   17 Jun 2024 7:47 AM GMT
NBK109.. మరోసారి అదే సెంటిమెంట్
X

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ NBK109. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగానే యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఉండబోతోందంట. రీసెంట్ గా బాలయ్య బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఎలివేషన్ టీజర్ ని రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న బాలయ్యకి NBK109తో మరో సూపర్ హిట్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

నందమూరి అభిమానులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారంట. బాలయ్య సూపర్ హిట్ మూవీ అఖండ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది. ఆ సినిమా బాలయ్య ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలో అదే డేట్ కి NBK109 చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.

త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత బాలయ్య అఖండ 2 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. అఖండకి సీక్వెల్ గా బోయపాటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అఖండ 2 చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారంట.

దీంతో పాటుగా గీతా ఆర్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ బాలయ్య చేయాల్సి ఉంది, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కూడా బాలయ్యకి సరిపోయే కథ కోసం వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు కూడా బాలయ్యతో కమిట్మెంట్ తీసుకున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది. ఒకవైపు పొలిటికల్ లీడర్ గా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు లైన్ లోకి తీసుకు వస్తున్నారు. రెగ్యులర్ మాస్ సినిమాలు మాత్రమే కాకుండా కాస్త కొత్తగా కూడా ట్రై చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నందమూరి బాలకృష్ణ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.