Begin typing your search above and press return to search.

ఇక రాజ‌స్థాన్ లో ద‌బిడిదిబిడే!

ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.

By:  Tupaki Desk   |   19 July 2024 6:09 AM GMT
ఇక రాజ‌స్థాన్ లో ద‌బిడిదిబిడే!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ 109వ చిత్రం బాబి ద‌ర్శ‌క‌త్వంలో షూటింగ్ శ‌ర‌గ వేగంగా జ‌రుగుతోన్న సంగతి తెలి సిందే. బాల‌య్య మాస్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌లుస్తున్నాడు. బాబిలాంటి మాస్ మేక‌ర్ కి బాల‌య్య లాంటోడు తగిలితే ఎలా ఉంటుందో? చెప్పాల్సిన ప‌న‌లేదు. థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయి. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.

మేజ‌ర్ ప్టార్ షూటింగ్ అంతా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే జ‌రిగింది. అవ‌స‌రం మేర వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. కానీ ఇంత‌వ‌ర‌కూ సుదూర ప్రాంతాల్లో మాత్రం షూటింగ్ నిర్వ‌హించ‌లేదు. తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్ల‌లేదు. ఈనేప‌థ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ కోసం రాజ‌స్తాన్ వెళ్తున్నారు. ఈనెల 21 నుంచి కొత్త షెడ్య‌ల్ అక్క‌డే ప్రారంభ‌మ‌వుతుంది. దీనిలో భాగంగా ప్ర‌ధానంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు పెద్ద పీట వేసిన‌ట్లు తెలుస్తోంది.

బాల‌కృష్ణ , బాబిడియోల్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిం చ‌నున్నారు. అలాగే కొంత టాకీ పార్టు కూడా ఉంటుంద‌ని స‌మాచారం. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందిట‌. ఇప్ప‌టికే చిత్ర‌బృందం రాజ‌స్తాన్ బ‌య‌ల్దేంది. బాల‌య్య మాత్రం ఆ రోజు ఉద‌యం రాజ‌స్తాన్ కి ప్లైట్ లో చేరుకుంటార‌ని తెలుస్తోంది. రాజ‌స్థాన్ లో బాల‌య్య గ‌త సినిమాలెన్నో షూటింగ్ లు జ‌రుపుకున్నాయి.

ముఖ్యంగా థార్ ఎడారిలో ఇసుకు తెన్నుల మ‌ధ్య బాల‌య్య పోరాటాలు సైతం చేసారు. తాజాగా మ‌రోసారి థార్ వ‌ర‌కూ వెళ్తారా? అన్న‌ది చూడాలి. యూనిట్ కేవ‌లం రాజ‌స్థాన్ షెడ్యూల్ గురించి మాత్రమే చెబుతుంది. మ‌రి అందులో థార్ ఎడారి ఉందా? లేదా? అన్న‌ది తెలియాలి. ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌ని బాల‌య్య బావిస్తున్నారు. అటు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో మ‌రో సినిమా లాక్ అయిన నేప‌థ్యంలోనే తొంద‌ర ప‌డుతున్నారు.