Begin typing your search above and press return to search.

న‌టుడిగా నాయ‌కుడిగా NBK హ్యాట్రిక్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అజేయ‌మైన విజ‌యాలు, రికార్డ్ గురించి తెలుగు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 2:41 PM GMT
న‌టుడిగా నాయ‌కుడిగా NBK హ్యాట్రిక్
X

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అజేయ‌మైన విజ‌యాలు, రికార్డ్ గురించి తెలుగు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న ఓ వైపు గ్లామ‌ర్ రంగంలో వ‌రుస హిట్లు కొడుతూనే, మ‌రోవైపు రాజ‌కీయాల్లోను బంప‌ర్ హిట్లు కొడుతుండ‌డ‌మే దీనికి కార‌ణం. ఆయ‌న ఇప్పుడు డ్యూయ‌ల్ హ్యాట్రిక్ తో మాంచి జోష్ మీదున్నాడు.

హీరోగా ఇప్ప‌టికే సినీరంగంలో హ్యాట్రిక్ కొట్టాడు ఎన్బీకే. అఖండ‌- వీర‌సింహారెడ్డి- భ‌గ‌వంత్ కేస‌రితో హ్యాట్రిక్ కొట్టిన బాల‌య్య బాబు, ఇప్పుడు రాజ‌కీయాల్లోను హిందూపురం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ప‌ద‌విని చేప‌ట్టారు. రెండు ప‌డ‌వ‌ల‌పైనా ఆయ‌న హ్యాట్రిక్ లు కొట్ట‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విజ‌యాల‌ను బాల‌య్య అభిమానులు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. నంద‌మూరి నాయ‌కుడా మ‌జ‌కానా? అంటూ ఫ్యాన్స్ లో చాలా ఉత్సాహం నెల‌కొంది.

పాల‌కుడు స‌రిగా లేక‌పోతే ప్ర‌జ‌లు నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తారు. కానీ హిందూపురం ప్ర‌జ‌లు బాల‌య్య ప‌నిత‌నాన్ని మెచ్చి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప‌ట్టంగ‌ట్ట‌డాన్ని గ‌మ‌నించి తీరాలి. ఏపీలో అఖండ విజ‌యం సాధించిన‌ తెలుగు దేశం దాని మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ఐదేళ్ల పాల‌నకు సిద్ధ‌మ‌వుతోంది. తెలుగు దేశం ఎమ్మెల్యేగా ఎన్బీకే అసెంబ్లీలో అడుగుపెట్టి త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని కోరుకుంటున్నారు.