నా సినిమాలే నాకు పోటీ.. ప్రేక్షకుల నీరాజనాలను మించిన సంపదలేదు..!
ఈ వేడుకకు విశిష్ఠ అతిథిగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అటెండ్ అయ్యారు. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణ అదే ఉత్సాహంతో తన స్పీచ్ తో అలరించారు.
By: Tupaki Desk | 10 Nov 2023 5:30 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు విశిష్ఠ అతిథిగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అటెండ్ అయ్యారు. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణ అదే ఉత్సాహంతో తన స్పీచ్ తో అలరించారు.
ముందుగా వేడుకకు వచ్చిన అతిథులకు ప్రేక్షకులకు అభిమానులకు కళాభివందనాలు తెలిపారు బాలకృష్ణ. ఒక మంచి సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడతారో అంతకుమించిన సంపాదన సంతోషం జీవితంలో మరేది ఉండదని ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను. మరోసారి ఈ సినిమాకు అది జరిగిందని అన్నారు. కెరీర్ లో ఎన్నో సినిమాలు ఎన్నో నేపథ్యాల సినిమాలు చేశా.. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, బొబ్బిలి సింహం, రానా, భైరవద్వీపం, ఆదిత్య 369, లెజెండ్, సింహా, అఖండ, వీర సింహా రెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి ఇన్ని వైవిద్యమైన పాత్రలు చేసే దమ్ము ధైర్యం ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకమే.. అది నాన్న గారి నుంచి వచ్చిందని అన్నారు బాలకృష్ణ. తనని బాబాయ్ అని పిలిస్తే దబిడి దిబిడే కానీ ఈ సినిమాలో చిచ్చా గా నటించా. కథ పాత్ర ప్రాధాన్యత బట్టి ఎలాంటి పాత్రలైనా చేయాల్సిందే అని అన్నారు బాలకృష్ణ.
ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిరుచి ఉంది. 3 తరాలుగా నన్ను, చేస్తున్న సినిమాలను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నటీనటులుగా అందరు కష్టపడ్డాం.. సాంకేతిక నిపుణులు పడిన కష్టం ఆ సినిమా పూర్తయ్యాక దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో అని కళ్లు కాయలు కాసేలా చూసాం. అందుకే ఈ సినిమా ఇలాంటి అద్భుతమైన విజయాన్ని అందుకుంది అన్నారు. నా సినిమాలకు నా సినిమాలే పోటీ ఎందుకంటే విభిన్న సినిమాలు దర్శకులు, నిర్మాతలు, కథకులు అందరి ఫలితమే ఈ విజయ పరంపర అని అన్నారు బాలకృష్ణ.
అఖండ కూడా చాలెంజింగ్ మూవీ.. వీర సింహా రెడ్డి కూడా ఒక ప్రత్యేకమైన సినిమా ఇది కూడా అంతే.. తెర వెనుక ఉంది ఈ సినిమా విజయాన్ని సత్కరించడానికి ఈ సభ నిర్వహించాం. రాజు ఎక్కే పల్లకి కాదు మోసే బోయలు ఎవరోయ్ అనేది ముఖ్యం. సాంకేతిక వర్గం మొత్తం బాగా పనిచేశారు. నాన్నగారితో ఎన్నో సినిమాలు చేసిన రాఘవేంద్రరావు గారు ఈ వేడుకకు రావడం కార్యక్రమానికి నిండుదనం వచ్చింది. దాసరి లేరనే లోటు ఉంది. ఆయన కూడా ఉండి ఉంటే బాగుండేది..ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా తలలో నాలుకగా ఉండేవారని దాసరిని ఉద్దేశించి మాట్లాడారు బాలకృష్ణ.
ఇక ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే సినిమాను మించిన మాధ్యమం లేదని బాలయ్య అన్నారు. అది కొందరు చెబితేనే విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అద్భుతంగా చేశారు. పాత్రలన్నీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అనిల్‌కు మంచి ఫ్యూచర్ ఉంటుందని అన్నారు బాలకృష్ణ. భగవంత్ కేసరి త్వరలో హిందీలో రిలీజ్ అవుతుంది హిందీ డబ్బింగ్ కూడా తానే చెప్పానని అన్నారు బాలకృష్ణ.