Begin typing your search above and press return to search.

NC 23 కోసం గ్రాండియర్ సెట్.. హై లెవెల్లో..

ఈ సినిమాకి సంబందించి నాగచైతన్య, చందూ మొండేటి గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లి అక్కడి మత్స్యకారుల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 1:49 PM GMT
NC 23 కోసం గ్రాండియర్ సెట్.. హై లెవెల్లో..
X

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2లో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతోంది. ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో శ్రీకాకుళం నుంచి అండమాన్ మధ్య బంగాళాఖాతం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని టాక్.

ఈ సినిమాకి సంబందించి నాగచైతన్య, చందూ మొండేటి గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లి అక్కడి మత్స్యకారుల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నారు. వారితో కొన్ని రోజులు గడిపి సముద్ర వేటకి వెళ్ళే సమయంలో ఎలాంటి సిచువేషన్స్ ఉంటాయో అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తోంది.

లవ్ స్టొరీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. విరాటపర్వం తర్వాత సాయి పల్లవి తెలుగులో చేస్తోన్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా సన్నివేశాలు జైలు నేపథ్యంలో ఉంటాయని తెలుస్తోంది. ఈ అది కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న జైలులో కథ నడుస్తుందంట.

రియలిస్టిక్ గా ఉండటం కోసం ప్రత్యేకంగా జైలు సెట్ ని నిర్మిస్తున్నారంట. అది కూడా కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి చాలా సహజంగా ఉండేలా జైలుని డిజైన్ చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ జైలులో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించాల్సి ఉంటుందంట. భగవంత్ కేసరి సినిమా కోసం ప్రత్యేకంగా జైలు సెట్ వేశారు. అంతకంటే పెద్దగా నాగ చైతన్య మూవీ కోసం జైలుని నిర్మించే పనిలో ఉన్నారని సమాచారం.

శ్రీకాకుళం నుంచి ఫిషింగ్ కోసం సముద్రంపైకి వెళ్లి సరిహద్దులు దాటిపోయి జైలులో మగ్గిపోయిన మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కథతో మూవీ చేస్తోన్న నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా ఉండేలా సెట్స్ ని డిజైన్ చేయిస్తున్నారంట.