Begin typing your search above and press return to search.

సాక్షి వైద్యతో వరుణ్ క్రేజీ కెమిస్ట్రీ..!

ఇటీవల ఈ మూవీ నుంచి ఓ చిన్న వీడియో విడుదల చేశారు. దీంట్లో. హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   31 July 2023 12:52 PM GMT
సాక్షి వైద్యతో వరుణ్ క్రేజీ కెమిస్ట్రీ..!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చివరగా ఎఫ్3 తో హిట్ కొట్టిన ఆయన వరసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. ఈ మూవీలో వరుణ్ సరసన సాక్షి వైద్య నటిస్తున్నారు. ఆమెకు తెలుగులో ఇది రెండో సినిమా. మొదటి సినిమా అఖిల్ ఏజెంట్ లో మెరిసింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో, ఈ బ్యూటీ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.





కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. నీ జతై అంటూ ఈ పాట సాగుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య సాగే ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంది. వరుణ్, సాక్షిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.

కాగా, ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇక ఈ మెలెడీ సాంగ్ ని ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్ పాడారు. పాట విన సొంపుగా ఉందని, క‌చ్చితంగా ఈ సీజ‌న్‌లో ఇది ట్రెండింగ్ సాంగ్ అవుతుంద‌ని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో వరుణ్ ఏజెంట్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ క్యారెక్టర్ అందరినీ షాకింగ్ కి గురి చేస్తుందట. ఆమె కూడా ఓ స్పెషల్ అధికారిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ మూవీ నుంచి ఓ చిన్న వీడియో విడుదల చేశారు. దీంట్లో. హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారు. వరుణ్ ఈ మూవీలో అర్జున్ వర్మగా కనిపించనున్నాడు. ఓ స్పై అధికారిగా కనిపించనున్నాడని ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. మొత్తం కథ ESSAY(elite security service Agecy)చుట్టూ తిరుగగుతుంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా, యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ప్రవీణ్ సత్తారు కంటూ ఒక మార్క్ ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడేమో చూడాలి. ప్రవీణ్ సత్తారు కూడా ఈ హిట్ చాలా అవసరం.