Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్.. దిల్ రాజు.. హీరో ఎవరు..?

ఇక ప్రశాంత్ నీల్ సలార్ 2, ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   2 Feb 2025 4:38 AM GMT
ప్రశాంత్ నీల్.. దిల్ రాజు.. హీరో ఎవరు..?
X

K.G.F డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ తో సలార్ 1 చేసిన ప్రశాంత్ నీల్ పార్ట్ 2 ని నెక్స్ట్ చేయనున్నాడు. ఎన్ టీ ఆర్ తో చేస్తున్న సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. ఐతే తారక్ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక సలార్ 2వ భాగం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్ 2, ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు ఈమధ్యనే గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశాడు.

అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి బోల్తా కొట్టింది. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజల్ట్ తో తమకు ఒక పాఠం బోద పడిందని రీసెంట్ గా దిల్ రాజు అన్నారు. ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. ఐతే ఈ కాంబో సినిమాలో హీరో ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రశ్నగా మారింది. ఆల్రెడీ ఎన్ టీ ఆర్ తో చేస్తునాడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఉంది. అది సలార్ 2.

ఐతే దిల్ రాజు ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని అనుకున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఒకవేళ ప్రశాంత్ నీల్, ప్రభాస్ మళ్లీ కలిసి చేసే ఛాన్స్ ఉండొచ్చు. ప్రభాస్ కాకుంటే రాం చరణ్ ఆ ఛాన్స్ తీసుకుంటాడని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ విషయంలో భారీ నష్టాలు ఎదుర్కొన్న దిల్ రాజుకి అండగా ఉంటానని ఆల్రెడీ రాం చరణ్ చెప్పాడని టాక్. సో ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అయితే రాం చరణ్ సినిమా ఓకే చేసే ఛాన్స్ ఉంటుంది.

దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబోలో హీరోగా ప్రభాస్, చరణ్ ఇద్దరిలో ఒకరయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ ఇద్దరు కాకపోతే మాత్రం మరో స్టార్ ని చూసుకుంటారు. ఏది ఏమైనా దిల్ రాజు మరో పెద్ద సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. మరి దిల్ రాజు ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.