Begin typing your search above and press return to search.

'సలార్ 2' లీక్.. నీల్ మామ ఏం ప్లాన్ చేస్తున్నాడో!

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్'.

By:  Tupaki Desk   |   7 Oct 2024 1:35 PM GMT
సలార్ 2 లీక్.. నీల్ మామ ఏం ప్లాన్ చేస్తున్నాడో!
X

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్'. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో రెండో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సలార్ 2' సినిమాకి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండో భాగాన్ని 'సలార్: పార్ట్ 2 - శౌర్యంగ పర్వం' పేరుతో తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమేర షూటింగ్ చేశారు. మిగతా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ బయిటకు వచ్చింది. ఇది అత్యంత కీలకమైన టన్నెల్‌ ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన ఫోటో కావడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది.

'సలార్ 1' లో కాటేరమ్మ ఫైట్‌ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంత్ నీల్ అద్భుతంగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్ లో ప్రభాస్ తన విశ్వరూపం చూపించారు. అయితే సెకండ్ పార్ట్ లో కాటేరమ్మ ఫైట్‌ కంటే పది రెట్లు అద్భుతంగా ఉండే టన్నెల్‌ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని ప్రశాంత్ నీల్‌ భార్య ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ ఆ యాక్షన్ బ్లాక్ కు సంబంధించినవే అని తెలుస్తోంది.

గత కొన్నాళ్లుగా 'సలార్‌ 2' గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చలు జరగడం లేదు. కానీ ఇప్పుడు టన్నెల్‌ ఫైట్ లీక్స్ తో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఎక్స్ లో ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టీవ్ అయిపోయారు. కాటేరమ్మ కొడుకుతో టన్నల్ లో నీల్ మామ ఏం ప్లాన్ చేశాడో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సలార్ మొదటి భాగంలో మెయిన్ క్యారక్టర్స్ ను పరిచయం చేసిన దర్శకుడు.. ప్రభాస్ మాస్, యాక్షన్ ను చూపించారు. సెకెండ్ పార్ట్ లో అసలైన కథను చెప్పడంతో పాటుగా నెక్స్ట్ లెవల్ యాక్షన్, ఎలివేషన్స్, ఎమోషన్స్ ను చూపించబోతున్నారు. ఇందులో దేవరతగా ప్రభాస్, వర్ధ రాజా మన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావ్, టిన్ను ఆనంద్, దేవరాజ్, మైమ్ గోపీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా 'సలార్ 2' నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.