తాగుడు మానేయాలి.. ఐడెంటిటీని మార్చుకోవాలని నటి భర్త కండీషన్!
అనూహ్యంగా ఓ వివాదాస్పద కేసులో ఆమె పేరు వినిపించడంతో సడెన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 1 Nov 2024 2:45 AM GMT80లు, 90లలో అందరికి ఇష్టమైన ప్రముఖ హీరోయిన్. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, గోవిందా వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసింది. అనూహ్యంగా ఓ వివాదాస్పద కేసులో ఆమె పేరు వినిపించడంతో సడెన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. అటుపై నటన విరమించాక నగల డిజైనింగ్ వైపు మళ్లింది.
ఇదంతా ఎవరి గురించి? అంటే... పాపులర్ సీనియర్ కథానాయిక నీలం కొఠారి సోనీ గురించి. ఆమె 1984లో 15 ఏళ్ల వయసులో జవానీ చిత్రంలో తొలిసారిగా నటించింది. దీని తర్వాత లవ్ 86, ఇల్జామ్, సిందూర్, ఖుద్గర్జ్, హత్య, ఫర్జ్ కి జంగ్, బిల్లూ బాద్షా, ఆగ్ హీ ఆగ్ వంటి సినిమాల్లో నటించింది. సూరజ్ బర్జాత్యా `హమ్ సాథ్ సాథ్ హై`.. కరణ్ జోహార్ -కుచ్ కుచ్ హోతా హైలో అతిధి పాత్రతోను మెప్పించింది. ఇంతలో బాలీవుడ్లో నీలం చివరి చిత్రం 2001లో విడుదలైన కసమ్. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ అనే డ్రామా రియాలిటీ సిరీస్‌తో తిరిగి అభిమానుల ముందుకు వచ్చింది.
ఆ తర్వాత నటనకు దూరమై నగల డిజైనింగ్ వైపు మొగ్గు చూపింది. నాలుగు తరాల నగల వ్యాపారుల కుటుంబం నుండి వచ్చిన నీలం గత సంవత్సరం నేచురల్ డైమండ్స్ డాట్ కామ్‌తో మాట్లాడింది. నటనకు స్వస్తి చెప్పి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే తన నిర్ణయం గురించి కూడా చెప్పుకొచ్చింది. ``ప్రతిదానికీ షెల్ఫ్ లైఫ్ ఉన్నట్లే, ఆశించిన అవకాశాలు తగ్గిపోవడంతో నటనకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని .. నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నాకు తెలుసు`` అని అంగీకరించింది. అదృష్టవశాత్తూ నాకు బ్యాకప్ ప్లాన్ ఉంది అని కొఠారి చెప్పారు. తన తండ్రి నుండి వజ్రాల గురించి ప్రతిదీ నేర్చుకున్నట్లు అంగీకరించింది. ఆమె ప్రయోగాత్మకంగా శిక్షణ పొందుతున్నప్పుడు తన అభిరుచిని మెరుగుపరుచుకున్నానని తెలిపింది.
సూరజ్ బర్జాత్యా -హెచ్ఎస్ఎస్హెచ్ షూటింగ్ సమయంలో సల్మాన్, టబు, సైఫ్ అలీ ఖాన్ , సోనాలి బింద్రేలతో పాటు 1998 కృష్ణజింకలను వేటాడిన కేసులో ఆమె పేరు కూడా వినిపించింది. ఈ కేసువల్ల నీలం పేరు మార్మోగింది. నీలం గతంలో రిషి సేథియాను వివాహం చేసుకుంది. 2000లో వివాహం చేసుకున్న తర్వాత ఈ జంట అక్టోబర్ 2000లో విడాకులు తీసుకున్నారు. FLOBW మూడవ సీజన్లో భారతీయ దుస్తులను ధరించమని .. నాన్ వెజ్ ,ఆల్కహాల్ మానేయమని అతడు చెప్పినట్లు నీలం వెల్లడించింది. ఆమె అన్నింటికీ ఓకే చెప్పినా కానీ, ఆమె ఐడెంటిటీని కూడా మార్చమని అడిగాడని తెలిపింది. తరువాత సమీర్ సోనీలో మళ్లీ ప్రేమను కనుగొని 2011లో అతనిని వివాహం చేసుకుంది. ఈ జంట 2013లో ఒక కుమార్తెను దత్తత తీసుకున్నారు. ఆమెకు వారు అహానా అని పేరు పెట్టారు.